గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ , బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ' పెద్ది'. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం శ్రీలంకలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. రామ్ చరణ్ ఊరమాస్ లుక్ తో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ మూవీకి సంబంధించిన కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. లేటెస్ట్ గా జాన్వీకపూర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్స్ అభిమానుల అంచనాలను మరింత పెంచేశారు.
'అచ్చియమ్మ' గా జాన్వీ..
ఈ చిత్రంలో జాన్వీ కపూర్ 'అచ్చియమ్మ' అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 'ఫైర్స్ అండ్ ఫియర్‌లెస్' అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన రెండు పోస్టర్‌లు రిలీజ్ చేశారు. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫస్ట్ పోస్టర్ లో జాన్వీ కపూర్ సంప్రదాయ చీర, ఆభరణాలతో పాటు కూలింగ్ గ్లాసెస్ ధరించి, ఓ జీపుపై నిలబడి, జనం వైపు అభివాదం చేస్తూ కనిపించింది. సెకండ్ పోస్టర్ లో మైక్ ముందు నిలబడి ఉంది. గ్రామీణ నేపథ్యంలో ఈ ఉన్న పోస్టర్లు చూసి అభిమానులు ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మాస్ క్రికెటర్ 'పెద్ది'గా..
ప్రస్తుతం శ్రీలంకలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్న ఈ సినిమా, రామ్ చరణ్‌ను ఇదివరకెన్నడూ చూడని ఉత్తరాంధ్ర యాస మాట్లాడే మాస్ క్రికెటర్ 'పెద్ది'గా కనిపించనున్నారు. ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో క్రికెట్‌తో ముడిపడి ఉన్న బలమైన ఎమోషనల్ కథాంశంతో రూపొందుతోందని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండగా, రత్నవేలు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ వంటి అగ్ర సాంకేతిక నిపుణులు పనిచేయడం ఈ సినిమా స్థాయిని పెంచింది. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు భట్టాచార్య వంటి అగ్ర నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
►ALSO READ | రోషన్ 'ఛాంపియన్' టీజర్ రిలీజ్.. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాపై అంచనాలు రెట్టింపు!
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 27, 2026న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. త్వరలో మొదటి పాటను విడుదల చేసి ప్రమోషన్లను మరింత వేగవంతం చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Our #Peddi's love with a firebrand attitude 😎🔥
— PEDDI (@PeddiMovieOffl) November 1, 2025
Presenting the gorgeous #JanhviKapoor as #Achiyyamma ❤🔥#PEDDI GLOBAL RELEASE ON 27th MARCH, 2026.
Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli… pic.twitter.com/LFsESjTmYK
