రోషన్ 'ఛాంపియన్' టీజర్ రిలీజ్.. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాపై అంచనాలు రెట్టింపు!

రోషన్ 'ఛాంపియన్' టీజర్ రిలీజ్.. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాపై అంచనాలు రెట్టింపు!

టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ తనయుడు, రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ' ఛాంపియన్ '. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.  లేటెస్ట్ గా చిత్ర బృందం ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించడంతో పాటు టీజర్ ను రిలీజ్ చేసింది. ఈ మూవీని డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది.  

కథాంశం.. 

ఈ చిత్రానికి ప్రదీప్ అద్వైత్ దర్శకత్వం వహిస్తున్నారు.  స్వాతంత్ర్యానికి పూర్వం సికింద్రాబాద్‌లోని పరిస్థితులను నేపథ్యంగా చేసుకుని ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. రోషన్ ఇందులో మైఖేల్ సి. విలియమ్స్ అనే యువ ఫుట్‌బాల్ ఆటగాడిగా కనిపించనున్నారు. మైదానంలో తన అద్భుతమైన ప్రతిభతో దూసుకుపోతున్న మైఖేల్, బ్రిటిష్ పాలకుల దురహంకారాన్ని, వివక్షను చూసి చలించిపోతాడు. లండన్‌లో రాణి ఎలిజబెత్‌ను కలిసే అవకాశం వచ్చినా, దేశం కోసం పోరాడాలనే ఆలోచనతో అతను ఏ విధంగా బ్రిటిష్ వారికి ఎదురు తిరిగాడు అనేదే ఈ కథాంశం.

►ALSO READ | సైన్స్‌కు, అగ్ని పురాణానికి మధ్య భీకర యుద్ధం.. 'శంబాల' ట్రైలర్ హైప్ మామూలుగా లేదుగా!

పీరియాడిక్ లుక్‌లో..

ఈ 'ఛాంపియన్ మూవీని స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ కాన్సెప్ట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆది సరసన మలయాళి బ్యూటీ అనస్వర రాజన్ నటిస్తోంది. మిక్కీ జె. మేయర్ అందించిన సంగీతం, ఆర్. మధీ అద్భుతమైన సినిమాటోగ్రఫీ, పీటర్ హెయిన్ సమకూర్చిన యాక్షన్ సన్నివేశాలు సినిమా స్థాయిని పెంచాయి. ముఖ్యంగా, 'నిర్మలా కాన్వెంట్'లో క్యూట్ హీరోగా కనిపించిన రోషన్.. ఈ సినిమాలో పీరియాడిక్ లుక్‌లో, ఇంటెన్స్ ఫుట్‌బాల్ ఆటగాడిగా అద్భుతమైన పరివర్తన చూపించారు. యాక్షన్, రొమాన్స్, స్పోర్ట్స్ ఎమోషన్స్‌తో నిండిన ఈ 'ఛాంపియన్' టీజర్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఒక గొప్ప పీరియాడిక్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకులను అలరించడం ఖాయని  మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.