టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ 'శంబాల: ఏ మిస్టికల్ వరల్డ్'. భారీ బడ్జెట్ తో, విభిన్న కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నారు. డిసెంబర్ 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా ఈ చిత్రం ట్రైలర్ ను రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశారు. దీంతో ఈ సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేస్తోంది.
సాయికుమార్ గంభీరమైన వాయిస్‌తో మొదలైన ట్రైలర్, పురాణ కాలంలో శివుడికి, శక్తివంతమైన అసురుడికి మధ్య జరిగిన భయంకరమైన యుద్ధం నేపథ్యాన్ని పరిచయం చేస్తుంది. ఆ యుద్ధం కారణంగా శివుడి చెమట భూమిపై పడి ఒక వింత దివ్య దృగ్విషయానికి దారితీసిందని, అది అగ్ని పురాణం ప్రకారం చీకటి శక్తులను మేల్కొల్పిందని తెలుస్తోందంటూ ట్రైలర్ ఆకట్టుకుంటుంది.
ALSO READ : ఎట్టకేలకు నా ప్రేయసితో నిశ్చితార్థం..
ఈ కథనం 1980ల నాటి వాతావరణంలో, ఒక మారుమూల గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఆ ఊరిలో జరుగుతున్న అంతుచిక్కని హత్యలు, అతీంద్రియ సంఘటనలను పరిశోధించడానికి జియో-సైంటిస్ట్ విక్రమ్‌గా ఆది సాయికుమార్ రంగంలోకి దిగుతాడు. దేవుళ్లు, అద్భుతాలు అంటూ దేనినీ నమ్మని హేతువాది అయిన విక్రమ్‌కు, ఈ మిస్టికల్ శక్తిని ఛేదించడం ఒక పెను సవాల్ మారుతుంది.. లాజిక్‌కు, మర్మమైన శక్తులకు మధ్య జరిగే ఈ భీకర పోరాటమే సినిమా కథాంశం.
దర్శకుడు యుగంధర్ ముని ఈ చిత్రాన్ని గతంలో ఎప్పుడూ భారతీయ తెరపై చూపించని పాయింట్‌తో, అద్భుతమైన విజువల్స్‌తో తీర్చిదిద్దారు. ఆది సాయికుమార్ జియో-సైంటిస్ట్‌గా సరికొత్త అవతార్‌లో ఆకట్టుకున్నారు. అర్చన అయ్యర్ కథానాయికగా నటించగా, స్వాసిక , రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. శ్రీచరణ్ పాకాల అందించిన నేపథ్య సంగీతం ఉత్కంఠను పెంచింది. రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు విజువల్ వండర్‌ను అందిస్తుందని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. డిసెంబర్ 25న ఈ మిస్టికల్ వరల్డ్‌ను థియేటర్లలో చూడటానికి ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..
