Allu Sirish Engagement: ఎట్టకేలకు నా ప్రేయసితో నిశ్చితార్థం.. అల్లు శిరీష్ పోస్ట్ వైరల్!

Allu Sirish Engagement: ఎట్టకేలకు నా ప్రేయసితో నిశ్చితార్థం.. అల్లు శిరీష్ పోస్ట్ వైరల్!

టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు, యువ నటుడు అల్లు శిరీష్ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పారు. తాను ఎంతో కాలంగా ప్రేమిస్తున్న నయనికాతో నిశ్చితార్థం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఈ ఎంగేజ్‌మెంట్ వేడుక శుక్రవారం ( అక్టోబర్ 31న ) అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. 

ఎట్టకేలకు నాప్రేయసితో నిశ్చితార్థం.. 

ఈ సంతోషకరమైన శుభవార్తను అభిమానులకు సోషల్ మీడియా వేదికగా అల్లు శిరీష్  తెలిపారు. తన నిశ్చితార్థపు ఫోటోలను పంచుకున్నారు. ఈ సందర్భంగా.. నేను నా ప్రేయసి నా జీవిత భాగస్వామిగా మారుతోంది.. ఎట్టకేలకు  హ్యాపీగా నిశ్చితార్థాన్ని జరుపుకున్నాను అని పోస్ట్ చేశారు.  ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఇద్దరి ప్రేమకు కుటుంబాల అంగీకారం లభించడం, ఇంతటి పెద్ద వేడుక జరగడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు కొత్త జంటకు కంగ్రాట్స్ చెబుతూ పోస్ట్ చేస్తున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Allu Sirish (@allusirish)

 

మెగా ఫ్యామిలీ సమక్షంలో...

అల్లు , మెగా కుటుంబాల పెద్దల ఆశీస్సుల మధ్య ఈ నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ వేడుకలో అల్లు శిరీష్, నయనికా జంట రాయల్ లుక్‌లో మెరిసిపోయారు. వధూవరులు సాంప్రదాయ దుస్తుల్లో చాలా అద్భుతంగా కనిపించారు. ఉంగరాలు మార్చుకునే సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల హర్షాతిరేకాలు మిన్నంటాయి. హైదరాబాద్ లోని నయనిక నివాసంలో జరిగిన ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ తన కుటుంబంతో సహా హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబం, రామ్ చరణ్ – ఉపాసన, అలాగే వరుణ్ తేజ్ – లావణ్య వంటి కుటుంబ సభ్యులు కూడా పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు. 

నాయనమ్మ ఆశీస్సులు.. 

శిరీష్ గతంలోనే, అక్టోబర్ 1వ తేదీన తన తాత, దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా నిశ్చితార్థపు తేదీని ప్రకటించారు. అప్పుడు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో నయనికా చేయి పట్టుకుని పారిస్‌లో, ఈఫిల్ టవర్ ముందు తీసుకున్న రొమాంటిక్ చిత్రాన్ని పంచుకున్నారు. "నా నాయనమ్మ ఎప్పుడూ నన్ను పెళ్లి చేసుకోవాలని కోరుకునేది. ఆమె ఇప్పుడు మాతో లేకపోయినా, మేము ఈ ప్రయాణాన్ని ప్రారంభించే సమయంలో ఆమె పైనుంచి మమ్మల్ని ఆశీర్వదిస్తుందని నాకు తెలుసు. మా కుటుంబాలు మా ప్రేమను అపారమైన ఆనందంతో స్వీకరించాయి అని అప్పట్లో శిరీష్ భావోద్వేగంగా పోస్ట్ చేశారు.  అల్లు శిరీష్ నాయనమ్మ కోరిక నెరవేరుస్తున్నందుకు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు.