Bigg Boss Telugu 9 : బిగ్ బాస్ 9: డేంజర్ జోన్‌లో 'ఫైర్ బ్రాండ్'.. ఎనిమిదో వారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్!

Bigg Boss Telugu 9 : బిగ్ బాస్ 9: డేంజర్ జోన్‌లో 'ఫైర్ బ్రాండ్'..  ఎనిమిదో వారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్!

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ రసవత్తరంగా సాగుతుంది. ఎనిమిదో వారం ఎనిమినేషన్ పై ఉత్కంఠ నెలకొంది.  హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారు అన్నదానిపై సోషల్ మీడియాలో తెగ చర్చనడుస్తోంది.  ఈ వారంనామినేషన్‌లో  దివ్వెల మాధురి, సంజనా, పవన్, రీతూ చౌదరీ, కళ్యాణ్, రాము రాథోడ్, తనూజ, గౌరవ్‌ ఉన్నారు. అయితే వీరిలో ఎవరు ఇంటికి వెళ్తారనేది ఆసక్తి రేపుతోంది. అయితే లేటెస్ట్ గా ఆన్‌లైన్‌లో జరుగుతున్న అనధికారిక ఓటింగ్‌ సరళి ప్రకారం 'ఫైర్ బ్రాండ్' దివ్వెల మాధురి డేంజర్ జోన్‌లో ఉండడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మాధురి, గౌరవ్‌ మధ్య హోరాహోరీ

ఇప్పటివరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం చూస్తే..  వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అయిన దివ్వెల మాధురికి అతి తక్కువ ఓట్లు నమోదయ్యాయని టాక్. ఆమెతో పాటు గౌరవ్ గుప్తా కూడా డేంజర్ జోన్‌లో కొనసాగుతున్నాడని సమాచారం. ఈ ఇద్దరి మధ్య ఓట్ల తేడా కేవలం పాయింట్లలోనే ఉండటం ఈ వారం ఎలిమినేషన్‌ను మరింత రసవత్తరం మారింది..

ఎలిమినేషన్ గండం ఎవరికి?

హౌస్‌లోకి 'ఫైర్ బ్రాండ్‌'గా అడుగుపెట్టిన దివ్వెల మాధురి.. ఇతర కంటెస్టెంట్లతో అనవసరపు గొడవలు పెట్టుకోవడం, అతిగా అరవడం వంటి వాటితో నెగటివిటీని మూటగట్టుకుంది. నాగార్జున కూడా ఆమెకు గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో కాస్త తగ్గింది. అయితే మొదటిసారి నామినేషన్‌లోనే ఆమె డేంజర్ జోన్‌లోకి రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక గౌరవ్ గుప్తా హౌస్‌లో చాలా డల్‌గా, ఎలాంటి కంటెంట్‌నూ ఇవ్వకుండా ఉండటం అతనికి ప్రతికూలంగా మారింది. ఓట్ల తేడా చాలా తక్కువగా ఉన్నప్పటికీ, కంటెంట్ ఇవ్వడం లేదనే కారణంతో గౌరవ్‌ని ఎలిమినేట్ చేసి, అప్పుడప్పుడూ గొడవలతో హైలైట్ అవుతున్న మాధురిని ఉంచే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, చివరి నిమిషంలో పోలయ్యే ఓట్లు, బిగ్ బాస్ తీసుకునే నిర్ణయం బట్టి ఈ ఇద్దరిలో ఒకరు హౌస్‌ను వీడే అవకాశం ఉంది. తనూజ పుట్టస్వామి అత్యధిక ఓట్లతో సేఫ్ జోన్‌లో ముందుంది.

మాధురికి ఇమ్ము పనిష్మెంట్..

ఎప్పుడూ హౌస్‌మేట్స్‌ను మాటలతో చెడుగుడు ఆడేసుకునే దివ్వెల మాధురిని లేటెస్ట్ గా కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ కంట్రోల్ చేయడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఉదయం ఆలస్యంగా నిద్రలేచిన మాధురిని కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ శిక్షించగా, ఆమె నిద్ర మత్తులో మళ్లీ కునుకు తీసింది. దీంతో ఇమ్ము మాధురితో 20 గుంజీలు తీయించాడు. అయినా కూడా ఆమె నిద్ర ఆగకపోవడంతో, చివరికి పచ్చిమిర్చి తినిపించి పనిష్మెంట్ ఇచ్చాడు. సాధారణంగా ఎవరికీ లొంగని మాధురి.. ఇమ్ము ముందు సైలెంట్‌గా ఉండిపోయింది.

 

తనూజ వర్సెస్ పవన్

ఈ వారంలో తనూజ, పవన్ మధ్య జరిగిన గొడవ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రాత్రిపూట బెండకాయ వంటకం విషయంలో పవన్ అభ్యంతరం వ్యక్తం చేయగా.. తనూజ తీవ్రంగా రియాక్ట్ అయింది.  నువ్వు ఎక్స్‌ట్రాలు మాట్లాడకు, నువ్వెవరు చెప్పడానికి.. నీలాగా ఎవరూ చేయట్లేదు అంటూ పవన్ పై ఒంటికాలిపై లేచింది. మరోవైపు, దివ్య కూడా కాఫీ విషయంలో రీతూపై అరిచింది. ఈ అతి గొడవలు చూసిన ప్రేక్షకులు, భరణి రీ-ఎంట్రీ తర్వాత కొందరు కంటెస్టెంట్లు మరీ ఓవర్ చేస్తున్నారని, ముఖ్యంగా తనూజను రేషన్ మేనేజర్‌గా తీసేయాలని కామెంట్లు పెడుతున్నారు.

 శ్రీజ అవుట్, భరణి ఇన్?

ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు భరణి శంకర్, శ్రీజలకు బిగ్ బాస్ రీ-ఎంట్రీ ఛాన్స్ ఇవ్వడం హౌస్‌లో డ్రామా ఆసక్తికరంగా మారింది. వీరిద్దరికీ టాస్క్‌లు ఇచ్చి, ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా ఒక్కరిని మాత్రమే హౌస్‌లో ఉంచనున్నారు. అయితే, భరణికి టాస్క్‌ల సమయంలో తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మళ్లీ వచ్చిన భరణి కొన్ని టాస్క్ లలో శ్రీజపై విజయం సాధించారు . అంతే కాదు ఓటింగ్ లో కూడా ఆయనకే ఓట్లు ఎక్కువగా వచ్చినట్లు టాక్.. దీంతో ఈ రీ-ఎంట్రీ  పోటీలో శ్రీజ ఎలిమినేట్ అయినట్టు సమాచారం. ఈ వారం ఎలిమినేషన్  ఫలితం కావాలంటే వీకెండ్ ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..