- ప్రస్తుత టెర్మినల్స్‌పై ఒత్తిడి తగ్గించేందుకే..
- ఒక్కోచోట 14 నుంచి 20 వరకు ప్లాట్‌ఫామ్స్
- ప్రపోజల్స్రెడీ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన రైల్వే
హైదరాబాద్‌సిటీ, వెలుగు: దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నగరంలోకి పెరుగుతున్న రైళ్ల రాకపోకల కారణంగా పెరుగుతున్న రద్దీని తగ్గించేందుకు గ్రేటర్‌పరిధిలో మరో మూడు కొత్త రైల్వే టెర్మినల్స్నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే ప్లాన్లు రూపొందించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ఇందులో భాగంగా ట్రిపుల్ ఆర్, ఓఆర్ఆర్ మధ్య కొత్త రైల్వే టెర్మినల్స్నిర్మించనున్నారు.
ఇప్పటికే నగరంలో ఉన్న సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, చర్లపల్లి, లింగంపల్లిలో ఉన్న టెర్మినల్స్‌పై భారీగా ఒత్తిడి ఉంది. ఈ క్రమంలో కొన్ని నెలల కింద చర్లపల్లి రైల్వే టెర్మినల్నిర్మించారు. అయినా, ఇతర మెట్రోనగరాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లను, ఇప్పుడున్న టెర్మినల్స్‌లో నిలిపేందుకు తగినన్ని ప్లాట్ఫామ్స్లేక కొన్నింటిని శివారు ప్రాంతాలకే పరిమితం చేయాల్సి వస్తోంది.
నగరం కూడా విస్తరిస్తుండడం, జనాభా భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రైల్వే ప్రయాణికుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. అందుకే, హైదరాబాద్చుట్టూ కొత్తగా మూడు టెర్మినల్స్నిర్మించేందుకు రైల్వే ప్రపోజల్స్రెడీ చేసింది. వీటిని ట్రిపుల్ఆర్, ఓఆర్ఆర్మధ్య నిర్మించడం ద్వారా నగరంపై ఒత్తడిని తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఎక్కడెక్కడ అంటే..
ట్రిపుల్ఆర్వరకూ విస్తరిస్తున్న హైదరాబాద్జనాభా 2047 నాటికి 3 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని రైల్వే అధికారులు అంచనా. ప్రస్తుతం బల్దియా పరిధిలో 1.13 కోట్ల జనాభా ఉండగా, 2031 నాటికి 1.84 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం తూర్పున వరంగల్రూట్లో చర్లపల్లి రైల్వే టెర్మినల్నిర్మించిన రైల్వే.. సిటీకి వెస్ట్ సైడ్ శంకర్ పల్లి సమీపంలోని నాగులపల్లిలోనూ, నార్త్ వైపు మేడ్చల్ అవతల డబీర్ పూర్వద్ద, సౌత్ వైపు బెంగళూరు రూట్లో శంషాబాద్ సమీపంలో జుక్కల్ వద్ద రైల్వే టెర్మినల్స్ నిర్మించాలని భావిస్తోంది. ఈ టెర్మినల్స్ పూర్తిచేస్తే ఇప్పటికే ఉన్న టెర్మినల్స్ పై ఒత్తిడి తగ్గి, గ్రేటర్ రైల్వే ప్యాసింజర్లకు ఇబ్బందులు తప్పుతాయని అనుకుంటున్నారు.
భూసేకరణ పై దృష్టి
కొత్త రైల్వే టెర్మినల్స్‌కు అవసరమైన భూములను సేకరించే పనుల్లో అధికారులు తలమునకలయ్యారు. నాగులపల్లి వద్ద నిర్మించే టెర్మినల్ కోసం 325 ఎకరాల భూమి అవసరమవుతుందని , ఇక్కడి టెర్మినల్‌లో 20 ప్లాట్‌ఫారాలు, 14 పిట్లైన్స్, మరో 24 స్టేబ్లింగ్‌లైన్లు నిర్మించనున్నారు.
డబీర్పూర్వద్ద నిర్మించే టెర్మినల్‌కు 250 ఎకరాలు అవసరమవుతాయని, ఈ టెర్మినల్‌లో 14 ప్లాట్‌ఫారాలు, 10 పిట్లైన్స్, 14 స్టేబ్లింగ్‌లైన్లు నిర్మించనున్నారు. జుక్కల్టెర్మినల్నిర్మాణానికి 300 ఎకరాల భూమి అవసరం కాగా, 18 ప్లాట్‌ఫారాలు, 12పిట్లైన్స్, 20స్టేబ్లింగ్‌లైన్లు నిర్మించనున్నట్టు చెప్పారు.
