గుడ్ న్యూస్ : ఉద్యోగుల బకాయిలు రూ.1,032 కోట్లు విడుదల

గుడ్ న్యూస్ : ఉద్యోగుల బకాయిలు రూ.1,032 కోట్లు విడుదల

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. పంచాయతీరాజ్,  ఆర్ అండ్ బీ శాఖలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను కూడా కలుపుకొని శుక్రవారం ఒకేరోజు రూ.1,032 కోట్లను ఆర్థిక శాఖ రిలీజ్ చేసింది. ప్రజాభవన్‌‌లో ఆర్థిక శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ నిర్ణయం తీసుకున్నారు. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచి ఉద్యోగుల బకాయిలు పెండింగ్​లో ఉన్నాయి. అదేవిధంగా, రూ.10 లక్షల్లోపు పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలనే ప్రభుత్వ విధానానికి అనుగుణంగా పంచాయతీరాజ్, ఆర్ అండ్ ​బీ శాఖలకు సంబంధించిన మొత్తం రూ.320 కోట్లను కూడా ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశారు. ఇందులో ఆర్ అండ్ బీ శాఖకు చెందిన 3,610 బిల్లులకు సంబంధించి రూ.95 కోట్లు, పంచాయతీరాజ్, గ్రామీణ స్థానిక సంస్థలకు చెందిన 43,364 బిల్లులకు సంబంధించి రూ.225 కోట్లు ఉన్నాయి.