ఇన్సూరెన్స్ తీసుకోవాలి.. సడెన్ గా ఏదైనా ప్రమాదం జరిగితే అంత డబ్బు సర్దలేము. లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉండాలి. నాకేమైనా అయినా నా ఫ్యామిలీ ఆర్థికంగా భరోసా ఉంటుంది.. ఇది ఒక సగటు మనిషి ఆలోచనలు. దీన్ని క్యాష్ చేసుకుని.. ఇన్సూరెన్స్ ఏజెంట్స్ గా చెప్పి అమాయకుల నుంచి లక్షలు మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.
హైదరాబాద్ లో ఇన్సూరెన్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని శనివారం (నవంబర్ 01హైదరాబాద్ పోలీసులు ) పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ గజియాబాద్‌కు చెందిన శరద్ గార్గ్ ను అనే వ్యక్తి ఇన్సూరెన్స్ పేరున మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు.
మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్, ఆక్సిస్ బ్యాంక్ అధికారిగా నటిస్తూ మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇన్సూరెన్స్ ఇప్పిస్తానని చెప్పి బాధితుడి నుంచి 6 లక్షల 45 వేల రూపాయలు కాజేసినట్లు గుర్తించారు. ఇతని బారిన పడిన వాళ్లు దేశవ్యాప్తంగా ఆరుగురు బాధితులు ఉన్నారని, వారిలో ఒకరు తెలంగాణకు చెందినవారని పోలీసులు చెప్పారు. నిందితుడి నుంచి మూడు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, చెక్‌బుక్స్, షెల్ కంపెనీ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు.
