లవ్ మ్యారేజీకి ఒప్పుకోలేదని.. పేరెంట్స్ను చంపిన బిడ్డ.. మోకాళ్ల నొప్పులు తగ్గిస్తానంటూ మత్తు ఇంజక్షన్లు

లవ్ మ్యారేజీకి ఒప్పుకోలేదని.. పేరెంట్స్ను చంపిన బిడ్డ.. మోకాళ్ల నొప్పులు తగ్గిస్తానంటూ మత్తు ఇంజక్షన్లు
  • యాచారం దంపతుల మృతి కేసులో కూతురే నిందితురాలు
  • ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాలో పరిచయమైన వ్యక్తి కోసం దారుణం
  • అబ్బాయి కులం వేరని ఒప్పుకోకపోవడంతో హత్యకు ప్లాన్​ 
  • ఇద్దరికీ హెవీ డోస్ ఇచ్చి హత్య.. నిందితురాలు ఆస్పత్రిలో నర్సు 

వికారాబాద్, వెలుగు: ప్రేమ పెండ్లికి ఒప్పుకోలేదని తల్లిదండ్రులను ఓ యువతి హత్య చేసింది. ఓవైపు అప్పుల బాధ, మరోవైపు తన పెండ్లి చేయలేకపోతున్నామనే రందితోనే అమ్మానాన్న చనిపోయారని ఆమె అందరినీ నమ్మించింది. అయితే తల్లిదండ్రులు ఇద్దరూ ఒకేసారి అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తులో అసలు నిజం బయటపడింది. తల్లిదండ్రులకు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి బిడ్డనే చంపిందని పోలీసుల విచారణలో తేలింది. 

ఈ కేసు వివరాలను బుధవారం వికారాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డీఎస్పీ శ్రీనివాస్​రెడ్డి వెల్లడించారు. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామానికి చెందిన నక్కలి దశరథ్, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు, కుమారుడికి వివాహం జరిగింది.   

చిన్న కుమార్తె సురేఖతో కలిసి తల్లిదండ్రులు యాచారం గ్రామంలో ఉంటున్నారు. బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన ఆమె.. ప్రస్తుతం సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్నది. ఈ క్రమంలో సంగారెడ్డికి చెందిన ఓ యువకుడితో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సురేఖకు పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారింది. వాళ్లిద్దరూ ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఆ యువకుడిని పెండ్లి చేసుకుంటానని తన తల్లిదండ్రులకు సురేఖ చెప్పింది. అయితే ఆ అబ్బాయిది వేరే కులమని వాళ్లు ఒప్పుకోలేదు. 

ఈ విషయమై తల్లిదండ్రులతో సురేఖ పలుమార్లు గొడవ పడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పెండ్లికి ఒప్పుకునేది లేదని వాళ్లు తేల్చి చెప్పడంతో.. అమ్మానాన్నను చంపేయాలని ఆమె నిర్ణయించింది. తాను పని చేస్తున్న హాస్పిటల్ నుంచి పేషెంట్లకు ఇచ్చే మత్తు మందు(అట్రాక్యురియం) అర్టాసిల్ 2.5 ఎంఎల్ బాటిళ్లు నాలుగు దొంగతనం చేసింది. ఈ నెల 24న సంగారెడ్డి నుంచి మోమిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేటకు వచ్చింది. అక్కడ మెడికల్​షాపులో మూడు సిరంజీలు కొన్నది. అక్కడి నుంచి సొంత గ్రామం యాచారానికి వచ్చింది.  

మోకాళ్లు, ఒళ్లు నొప్పులు తగ్గిస్తానని చెప్పి...

అదే రోజు రాత్రి భోజనం చేస్తున్న సమయంలో మరోసారి ప్రేమ విషయాన్ని సురేఖ ప్రస్తావించగా.. తల్లిదండ్రులు అందుకు నిరాకరించారు. దీంతో వాళ్లు చనిపోతేనే తన పెళ్లి అవుతుందని ఆమె భావించింది. కొద్దిసేపటి తర్వాత మోకాళ్ల నొప్పులు, బాడీ పెయిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన మందులను డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మాట్లాడి తీసుకొచ్చానని తల్లిదండ్రులకు చెప్పింది. మొదట తన వెంట తెచ్చుకున్న మత్తు మందును మోతాదుకు మించి తల్లి లక్ష్మికి ఇచ్చింది. లక్ష్మి కింద పడి అక్కడిక్కడే మృతి చెందింది. 

కొద్దిసేపటి తర్వాత బయటి నుంచి చలి కాచుకుని తండ్రి దశరథ్ ఇంట్లోకు వచ్చాడు. అమ్మకు ఇంజక్షన్​ఇచ్చి పడుకోబెట్టానని నమ్మించింది. బాడీ పెయిన్స్​తగ్గుతాయని తండ్రిని కూడా నమ్మించి ఇంజక్షన్​ ఇచ్చింది. ఆయన కూడా కుప్పకూలి మృతి చెందాడు. వెంటనే తనకేమీ తెలియదన్నట్లుగా అన్న అశోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫోన్ చేసి అమ్మానాన్న చనిపోయారని సురేఖ చెప్పింది. అప్పుల బాధకు తోడు తన పెండ్లి చేయలేకపోతున్నామనే రందితోనే వాళ్లు మృతి చెందారని అందరినీ నమ్మించింది. అయితే తన తల్లిదండ్రుల మృతిపై అనుమానం ఉన్నట్టు బంట్వారం పోలీస్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ నెల 25న అశోక్ ఫిర్యాదు చేశాడు.

ఇంజక్షన్​ బాటిళ్ల ఆధారంగా.. 

అశోక్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో నాలుగు ఖాళీ ఇంజక్షన్​బాటిళ్లు, వాడి పారేసిన రెండు సిరంజీలు స్వాధీనం చేసుకున్నారు. సిరంజీలకు రక్తం చుక్కలు ఉన్నట్టు గుర్తించారు. మరోవైపు కుటుంబసభ్యులు, చుట్టుపక్కల వారు సురేఖపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఆమెను  విచారించగా తానే హత్య చేసినట్టు ఒప్పుకుంది. తన పెండ్లికి అడ్డొస్తున్నారనే మర్డర్ చేశానని చెప్పింది. దీంతో సురేఖను అరెస్టు చేసి రిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. కేసును చేధించిన ధారూర్​సీఐ రఘురామ్, బంట్వారం ఎస్సై విమలను డీఎస్పీ శ్రీనివాస్​రెడ్డి అభినందించారు.