- జగిత్యాల జిల్లా కోరుట్లలో ఘటన
కోరుట్ల, వెలుగు : ప్రేమ పెండ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆదివారం జరిగింది. ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్లలోని నక్కలగుట్ట కాలనీకి చెందిన గోగుల నరేశ్ (23) కూలీ పని చేస్తుంటాడు. ఓ అమ్మాయిని ప్రేమించిన నరేశ్.. ఆమెనే పెండ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పాడు.
అయితే పెండ్లికాని ఇద్దరు అన్నలు ఉండగా.. నీవు పెండ్లి చేసుకోవడం’ కుదరదని నరేశ్ తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో మనస్తాపానికి గురైన నరేశ్ ఆదివారం నక్కలగుట్ట కాలనీ శివారులోని ఓ పొలం వద్దకు వెళ్లి మామిడి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు అతడి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.
