బంగారంతో కోటీశ్వరులు అయిపోవచ్చని అనుకున్నారేమో.. ఏకంగా తిన్నింటికే కన్నం పెట్టారు పనిమనుషులు. వెయ్యి కాదు లక్ష కాదు.. ఏకంగా 5 కోట్ల 60 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో ఎస్కేప్ అయ్యారు. శనివారం (జనవరి 31) ఈ ఘరానా చోరీ కేసును ఛేదించారు పోలీసులు.
జూబ్లీహిల్స్ పరిధిలో ఓ ఇంట్లో ఈటీవల బంగారం చోరీ జరిగిన విషయం తెలిసిందే. జనవరి 21న చోరీ జరిగినట్లు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు జనవరి 30న నిందితులుగా భావించిన ఇద్దరిని యూసుఫ్ గూడలో అరెస్టు చేశారు. విచారణలో దొంగతనం చేసినట్లుగా అంగీకరించారు.
►ALSO READ | లవ్ మ్యారేజీకి ఒప్పుకోలేదని.. పేరెంట్స్ను చంపిన బిడ్డ.. మోకాళ్ల నొప్పులు తగ్గిస్తానంటూ మత్తు ఇంజక్షన్లు
పనిమనిషి తన బంధువుతో కలిసి చేసిన చోరీకి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. సుమారు 429 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. అంటే వీటి విలువ ఇప్పుడున్న లెక్కల ప్రకారం.. 22 క్యారెట్ల గోల్డ్ ఒక గ్రామ్ రూ.14,720 గా ఉంది. అంటే 429 గ్రాములు అంటే 5 కోట్ల 63 లక్షల రూపాయలు ఉంటుంది.
నిందితుల నుంచి 178.32 గ్రాముల బంగారం, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అదే విధంగా 5 లక్షల నగదు, బ్యాంక్ ఖాతాల్లోని రూ. 1.98 లక్షలు ఫ్రీజ్ చేశారు. నిందితులు విశాఖపట్నం పారిపోతుండగా అరెస్ట్ చేసినట్లు ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు. ఇళ్లలో పనివారిని నియమించేటప్పుడు పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి అంటూ ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి చేశారు.
