టాలీవుడ్‌లో ఇటీవల కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకుంటున్నాయి. అదే బాటలో సస్పెన్స్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం "అమరావతికి ఆహ్వానం". జీవీకే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణ, ఎస్తర్ నోరోన్హా లీడ్ రోల్స్‌లో నటించారు. శివ కంఠమనేని, సుప్రిత, హరీష్, అశోక్ కుమార్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.
మురళీ మోహన్ చేతుల మీదుగా టీజర్ లాంచ్!
లేటెస్ట్ గా ఈ చిత్ర టీజర్‌ను సీనియర్ నటుడు, నిర్మాత మురళీ మోహన్ విడుదల చేశారు. ఈ టీజర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. సంభాషణలు ఏవీ లేకుండానే, కేవలం భయంకరమైన విజువల్స్, ఒళ్లు గగుర్పొడిచే బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో టీజర్‌ను కట్ చేయడం సినిమా స్థాయిని పెంచింది. టీజర్ లాంచ్ సందర్భంగా మురళీ మోహన్ మాట్లాడుతూ.. డైరెక్టర్ జీవీకే ప్రతిభ టీజర్‌లోనే కనిపిస్తోంది. బలమైన కంటెంట్‌తో వస్తున్న ఈ హారర్ థ్రిల్లర్ ప్రేక్షకులను తప్పకుండా భయపెడుతుంది అని ఆకాంక్షించారు.
సృష్టి రహస్యం.. జనన మరణ పోరాటం!
ఈ సినిమా థీమ్ చాలా వైవిధ్యంగా ఉండబోతోందని మేకర్స్ హింట్ ఇచ్చారు. "కీటక మరణం కప్ప జీవనాధారం.. కప్ప మరణం పాము జీవనాధారం.. ఈ సృష్టి మొత్తం ఒక యుద్ధం" అంటూ గతంలో విడుదలైన డైలాగ్స్ ఈ సినిమాలో ఏదో ఒక లోతైన రహస్యం దాగి ఉందని స్పష్టం చేస్తున్నాయి. గ్లామరస్ రోల్స్‌కే పరిమితం కాకుండా, ధన్య బాలకృష్ణ, ఎస్తర్ నోరోన్హా ఈ చిత్రంలో పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రల్లో కనిపించబోతున్నారు.
►ALSO READ | Vijay-Jana Nayagan: పాలిటిక్స్ వల్లే నా సినిమాకు ఇబ్బందులు.. ఓపెన్ అయిన దళపతి విజయ్.
రిలీజ్ డేట్!
పద్మనాబ్ భరద్వాజ్ అందించిన సంగీతం, ముఖ్యంగా నేపథ్య సంగీతం (BGM) ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్‌పై కేఎస్ శంకర్ రావు, ఆర్. వెంకటేశ్వర రావు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకుల కోసం ఈ చిత్రం ఫిబ్రవరి 13న థియేటర్లలోకి రానుంది. వాలెంటైన్స్ వీక్‌లో ఒక భయానక అనుభూతిని పొందేందుకు సిద్ధంగా ఉండాలని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ మిస్టరీ కథ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో తెలియాలంటే ఫిబ్రవరి 13 వరకు వేచి చూడాల్సిందే!
