న్యూజిలాండ్ తో జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషాన్ దంచికొట్టాడు. తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ సెంచరీ విధ్వంసం సృష్టించాడు. శనివారం (జనవరి 31) తిరువనంతపురం వేదికగా గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ 42 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. కిషాన్ ఇన్నింగ్స్ లో 6 ఫోర్లతో పాటు 10 సిక్సర్లున్నాయి. సెంచరీ తర్వాత 103 పరుగుల వద్ద కిషాన్ ఔటవ్వడంతో తన గ్రేట్ ఇన్నింగ్స్ కు ముగింపు పడింది.
శాంసన్ ఔటైన తర్వాత బరిలోకి దిగిన కిషాన్ ఆరంభంలో ఆచితూచి ఆడినా ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఊరమాస్ ఇన్నింగ్స్ ఆడుతూ స్కోర్ కార్డును పరుగులు పెట్టించాడు. 9 ఓవర్లలో 82 పరుగులు చేసి పర్వాలేదనిపించిన ఇండియా ఆ తర్వాత కిషాన్ ధాటికి స్కోర్ కార్డు దూసుకెళ్లింది. 10 ఓవర్లో కిషాన్, సూర్య ధాటికి 20 పరుగులు వచ్చాయి. ఇష్ సోది వేసిన 12 ఓవర్లో కిషాన్ విశ్వరూపం చూపించాడు. ఏకంగా ఈ ఓవర్లో 28 పరుగులు కొట్టాడు. 4,4,4,6,4,6 కొట్టడంతో పాటు ఒక వైడ్ రూపంలో మొత్తం 29 పరుగులు వచ్చాయి. ఈ మ్యాచ్ లో 27 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన కిషాన్.. 42 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకోవడం విశేషం.
►ALSO READ | IND vs NZ: బ్యాటింగ్‌లో శివాలెత్తిన టీమిండియా.. కిషాన్ విధ్వంసకర సెంచరీ.. సూర్య, పాండ్య మెరుపులు
టీమిండియా భారీ స్కోర్:
న్యూజిలాండ్ తో జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా బ్యాటింగ్ లో శివాలెత్తింది. శనివారం (జనవరి 31) తిరువనంతపురం వేదికగా గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో కివీస్ బౌలర్లలకు చుక్కలు చూపించారు. ఇషాన్ కిషాన్ (44బంతుల్లో 103: 6 ఫోర్లు, 10 సిక్సర్లు) విధ్వంసక సెంచరీ తో పాటు కెప్టెన్ సూర్య (30 బంతుల్లో 63: 4 ఫోర్లు, 6 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్ తో ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. పాండ్య 17 బంతుల్లోనే 42 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో లాకీ ఫెర్గుసన్ కు రెండు వికెట్లు దక్కాయి.
<
MAIDEN T20I HUNDRED FOR ISHAN KISHAN. 💯
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 31, 2026
- The celebration between Kishan and Hardik Pandya was pure bliss. 🥺❤️
pic.twitter.com/lgS011uBoM
