ఖమ్మంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు నార్కోటిక్స్ సెల్అధికారులు. ఒడిశానుంచి హైదరాబాద్ కు గంజాయి రవాణా చేస్తున్న నలుగురు డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు. గోదావరి ఖని, ఖమ్మం బస్టాండులలో తనిఖీలు చేపట్టగా గంజాయి అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టు అయింది. ఒడిశా నుంచి బస్సుల్లో గంజాయి తరలిస్తున్నారు ఈ ముఠా సభ్యులు. వివరాల్లోకి వెళితే..
ఖమ్మం జిల్లాలో శనివారం (జనరి 31) నార్కోటిక్స్ సెల్ అధికారులు ముమ్మరంగా తనీఖీలు చేపట్టారు. ఖమ్మం, గోదావరి ఖనీ బస్టాండులలో విస్తృతంగా జరిపిన తనిఖీలో పెద్ద ఎత్తున గంజాయి పట్టుకున్నారు. ఒడిశానుంచి ఖమ్మం జిల్లాకు బస్సుల్లో గంజాయి తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. ఖమ్మంలో ఇద్దరు, గోదావరిఖనిలో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు పాంగి రఘుపతి, పాంగి సాబి లు ఒడిశాలోని కొరాపూట్ నుంచి హైదరాబాద్ కు గంజాయి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మరో డ్రగ్ పెడ్లర్ మహేష్ వామన్ రావు పరారీలో ఉన్నాడు. నిందితులను ఖమ్మం రూరల్ పోలీసులకు అప్పగించారు.
►ALSO READ | ఫైర్ సేఫ్టీపై హైడ్రా స్పెషల్ ఫోకస్.. షాపుల యజమానులకు కీలక ఆదేశాలు..
