అమ్మో అమ్మో.. ఏం స్కెచ్ ఇది.. మొగుడిని అడ్డు తొలగించుకోవటానికి వేసిన ప్లాన్ చూసి పోలీసులే.. వామ్మో.. వామ్మో అంటూ నోరెళ్లబెట్టారు. మొగుడు నుంచి విడాకులు తీసుకుని.. ప్రేమికుడితో సెటిల్ అవ్వటానికి.. ఆ భార్య వేసిన ప్లాన్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. ఈ క్రైం సీన్ మొత్తం ఏంటో తెలుసుకుందామా...
ఈ కన్నింగ్ క్రైమ్ కహానీ ఉత్తరప్రదేశ్ లక్నోలో జరిగింది. ఈ కేసు మొదట 2026 జనవరి 14న వెలుగులోకి వచ్చింది. కకోరీ పరిధిలో దుర్గాగంజ్ దగ్గర భజరంగ్ దళ్ సమాచారంతో పోర్టర్ వెహికిల్ ను ఆపిన పోలీసులు.. ఆ వాహనంలో బీఫ్ గుర్తించారు. ఆ తర్వాత ఇదే కంప్లైంట్, ఇదే వ్యక్తిపై పలుమార్లు రావటం.. పోలీసులు అదుపులోకి తీసుకోవటం జరుగుతూ వస్తోంది. గోహత్య నేరం కింద అరెస్టు చేసిన పోలీసులు.. విచారణలో షాకింగ్ నిజాలు కనుగొన్నారు.
భజరంగ్ దళ్ సమాచారంతో వెహికల్ ను పట్టుకున్న పోలీసులు 12 కేజీల ఆవు మాంసాన్ని గుర్తించారు. విచారణలో తేలిందేమిటంటే.. అమీనాబాద్ లోని ఒక పేపర్ ఫ్యాక్టరీ ఓనర్ .. వాసిఫ్ అనే వ్యక్తిపైన బుక్ అయిందనీ. అతినికి డెలివరీ చేసేందుకు వెళ్తున్నట్లు తేలింది. డెలివరీ కోసం ఓటీపీ వెరిఫికేషన్ లో కూడా అది వాసిఫ్ మొబైల్ లింక్ అయినట్లుగానే నిర్ధారణ కావడం మరింత టెన్షన్ కు గురిచేసింది.
ఇంత్ర కుట్ర కోణం ఉందా..?
ఈ కేసుపై అనుమానం వచ్చిన పోలీసులు.. ఆ వ్యక్తి ఇంటి సీసీటీవీ ఫుటేజ్ చూసి అసలు నిజం కనుగొన్నారు. ఓటీపీ జనరేట్ అయినప్పుడు వాసిఫ్ బాత్ రూమ్ లో ఉండగా.. అదే సమయంలో అతని భార్య ఫోన్ తీసుకుని ఓటీపీ చెప్పడం ఫూటేజ్ లో గ మనించారు. ఆ తర్వాత వాసిఫ్ భార్యను విచారించగా.. ఉద్దేశపూర్వకంగా.. అతన్ని ఇరికించేందుకే చేసినట్లు ఒప్పుకుంది. మరింత లోతుగా వెళ్లగా.. వాసిఫ్ భార్య, ఆమె లవర్ కలిసి చేసినట్లు తేల్చారు పోలీసులు. మధ్య ప్రదేశ్ భోపాల్ కు చెందిన అమాన్ తో కలిసి తన భర్తను ఇరికించేందుకు ఇంతటి ప్లాన్ చేసినట్లు నిర్ధారించారు పోలీసులు.
పోలీసు అధికారి సతీష్ చంద్ర రాథోడ్ చెప్పిన వివరాల ప్రకారం.. అమాన్.. ఆ మహిళ భర్త వివరాల ఆధారంగా అమీనా బాద్ నుంచి కకోరీకి ఆన్ లైన్ పోర్టర్ బుక్ చేశాడు. భోపాల్ నుంచి బీఫ్ స్పెషల్ ప్యాక్ లో ట్రాన్స్ పోర్ట్ అయ్యింది. అయితే వాసిఫ్ ను ఇరికించేందుకు పోలీసులతో పాటు భజరంగ్ దళ్ కు రాహుల్ అనే పేరు చెప్పి ఫోన్ చేశాడు అమాన్.
ఇరికించేందుకు ఎన్ని ప్రయత్నాలో..
వాసిఫ్ ను ఇరికించేందుకు చేసిన ప్రయత్నాలు చూసి పోలీసులే షాకయ్యారు. వాసిఫ్ వైఫ్, అమాన్ ఇద్దరూ 2022లో ఇన్ స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యారు. అక్కణ్నుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వాసిఫ్ ను అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ చేశారు. అందుకోసం వీరిద్దరూ కలిసి 2025 డిసెంబర్ లో కొత్త సిమ్ కార్డు తీసుకున్నారు.
గతంలో పార్క్ చేసిన వాసిఫ్ కు చెందిన మహింద్రా థార్ లో 20 కేజీల బీఫ్ పెట్టి ఇరికించాలని చూశారు. ఈ కేసులో అప్పట్లో వాసిఫ్ అరెస్టయి జైలుకెళ్లి వచ్చాడు. అయితే వాసిఫ్ వెంటనే బయటకు రావటం ఆమెకు ఇష్టం లేదు. అతన్ని పూర్తిగా జైల్లోనే ఉంచే ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో అమాన్ ను కూడా అరెస్టు చేసిన పోలీసులు.. వాసిఫ్ భార్యను కూడా కస్టడీలోకి తీసుకున్నారు. వాసిఫ్ నుంచి విడాకులు తీసుకునేందుకు.. అతడిని తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు.
SHOCKING: Wife's Boyfriend Conspiracy Exposed in Lucknow Beef Case
— زماں (@Delhiite_) January 22, 2026
- Wasif's wife Amina wanted divorce, so she conspired with Instagram boyfriend Aman (met in 2022).
Amina brought Aman to Lucknow, arranged rental room, introduced him as her "brother" to everyone.
Sept 2025:… pic.twitter.com/m5NgZ5smg0
