గచ్చిబౌలి, వెలుగు: కిరాణం షాపు మాటున గంజాయి అమ్ముతున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొండాపూర్ స్ర్పింగ్ వ్యాలీలో కిరాణం షాపు నిర్వహిస్తున్న నెల్లూరుకు చెందిన పవన్ కుమార్ రెడ్డి సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో గంజాయి అమ్ముతుండగా పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు.
అతని వద్ద 8.37 గ్రాముల గంజాయి, 43 గ్రాముల ఓజీ కుష్ స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో గోపన్‌పల్లి బీఎల్ కేరెడ్డి ఫార్మ్ హౌస్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న యూపీకి చెందిన మట బాదల్‌ను అరెస్ట్ చేశారు. ఈ దాడిలో 272 గ్రాముల గంజాయి మొక్కను స్వాధీనం చేసుకున్నారు.
