ఓటీఎస్పై ప్రచారం షురూ

ఓటీఎస్పై ప్రచారం షురూ

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆస్తి పన్ను బకాయిల వసూలుకు తీసుకువచ్చిన ఓటీఎస్ స్కీంపై మంగళవారం నుంచి అధికారులు విస్తృత ప్రచారం మొదలుపెట్టారు. ఇప్పటివరకు స్కీం గురించి జనాల వరకు తీసుకువెళ్లడంలో విఫలం కావడంతోనే పెద్దగా వసూళ్లు కాలేదని గుర్తించిన అధికారులు మంగళవారం నుంచి ఆ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

స్కీమ్ ప్రయోజనాలను సోషల్​మీడియా, డిజిటల్ వేదికల ద్వారా చెప్తున్నారు. ఆస్తి పన్నును జీహెచ్ఎంసీ పోర్టల్ (ghmc.gov.in), MyCURE యాప్, మీ సేవ కేంద్రాలు, జీహెచ్ఎంసీ సిటిజన్ సర్వీస్ సెంటర్లలో  చెల్లించవచ్చని కోరుతున్నారు. ఇంటి పన్ను బకాయిలున్న వారు 31లోపు చెల్లిస్తే వడ్డీపై 90 శాతం వరకు రాయితీ వస్తుందని చెప్తున్నారు.