ధోనీ, రోహిత్‌‌‌‌ సరసన నేనంటే చాలా సంతోషంగా ఉంది: సూర్య

ధోనీ, రోహిత్‌‌‌‌ సరసన నేనంటే చాలా సంతోషంగా ఉంది: సూర్య

ముంబై: ఇండియాకు ఐసీసీ ట్రోఫీలను అందించిన లెజెండరీ కెప్టెన్లు కపిల్‌‌‌‌ దేవ్‌‌‌‌, ఎంఎస్‌‌‌‌ ధోనీ, రోహిత్‌‌‌‌ శర్మ సరసన తానూ నిలిచినందుకు చాలా సంతోషంగా ఉందని టీ20 కెప్టెన్‌‌‌‌ సూర్యకుమార్‌‌‌‌ యాదవ్‌‌‌‌ అన్నాడు. ఈ ఘనత గొప్పతనాన్ని గ్రహిస్తున్నానని చెప్పాడు. ‘ఎలైట్‌‌‌‌ గ్రూప్‌‌‌‌లో చేరినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి గొప్ప వ్యక్తుల మధ్య నా గురించి కూడా మాట్లాడుకోవడం చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది.

భవిష్యత్‌‌‌‌లోనూ దీన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తా. టీమిండియా మరిన్ని ట్రోఫీలు గెలిచేందుకు సాయపడతా. 2024లో మేం గెలిచినప్పుడు చాలా ప్రత్యేకం అనుకున్నాం. ఇప్పుడు స్వదేశంలో గెలవడం మరింత స్పెషల్‌‌‌‌గా మారింది’ అని సూర్యకుమార్ పేర్కొన్నాడు.