హైదరాబాద్ సిటీ, వెలుగు: మొయినాబాద్‌లోని కేజీ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థి వ్యవహారాల విభాగం ఆధ్వర్యంలో ‘ఇకార్యస్’, ‘ఇన్విక్టా’ 2026 వార్షికోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. టెక్నికల్, స్పోర్ట్స్, కల్చరల్ఈవెంట్స్తో మార్చి 13 వరకు కొనసాగనున్నాయి. జేఎన్‌టీయూహెచ్ వైస్ చాన్స్ లర్ డాక్టర్ టి. కిషన్ కుమార్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాలేజీ చైర్మన్ ఎల్.ఎన్.కే. కృష్ణారెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ సాయి సత్యనారాయణ రెడ్డి, విద్యార్థి వ్యవహారాల విభాగాధిపతి ఎం. రత్నచారి పాల్గొన్నారు.
