భారత్, శ్రీలంక వేదికలుగా జరుగుతున్న మహిళా క్రికెట్ వన్డే వరల్డ్ కప్ క్లైమాక్స్ కు వచ్చింది. నెల రోజుల పాటు అభిమానులను అలరిస్తూ వస్తున్న వరల్డ్ కప్ లో ఫైనల్ మాత్రమే మిగిలింది. టోర్నీ మొత్తం అద్భుతంగా రాణించిన ఇండియా, సౌతాఫ్రికా జట్లు ఫైనల్ ఆడనున్నాయి. ఆదివారం (నవంబర్ 2) జరగనున్న ఈ గ్రాండ్ ఫైనల్ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరుగుతుంది. 12 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఇండియాలో వరల్డ్ కప్ జరగనుండడంతో ఫ్యాన్స్ ఈ సారి మన మహిళల జట్టు ట్రోఫీ గెలుస్తుందని ఆశలు పెట్టుకున్నారు.
భారత్ చివరగా 2013లో ప్రపంచ్ కప్‌కు ఆతిథ్యం ఇవ్వగా.. ఈ టోర్నీలో ఇండియా ఉమెన్స్ టీమ్ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. మరోవైపు సౌతాఫ్రికా మహిళా జట్టు తొలిసారి ఫైనల్ కు చేరుకుంది. ఫైనల్లో ఇండియాకు గెలిచి తమపై చోకర్స్ అనే ముద్రను పోగొట్టుకోవాలని చూస్తుంది. సొంత దేశంలో టోర్నీ కావడంతో భారత్ హాట్ ఫేవరెట్. ఈ ఫైనల్లో గెలిచిన జట్టుకు కాసుల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన జట్టు.. రన్నరప్ గా నిలిచిన జట్టు ఎన్ని కోట్లు గెలుచుకుంటుందో.. టోర్నీ ప్రైజ్ మనీ ఎంతో ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుతం జరుగుతున్న మహిళల వన్డే వరల్డ్ కప్ కు ఐసీసీ ప్రైజ్ మనీని భారీగా పెంచేసింది. మొత్తం వరల్డ్ కప్ ప్రైజ్ మనీ రూ. 122 కోట్లుగా నిర్ణయించారు. విజేతగా నిలిచిన జట్టుకు రూ. 39 కోట్ల రూపాయలు అందుతాయి. రన్నరప్ గా నిలిచిన జట్టుకు రూ. 20 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అందుతాయి. సెమీ ఫైనల్ గా నిలిచిన రెండు జట్లకు రూ. 10 కోట్ల ప్రైజ్ మనీ లభిచనుంది. ఒక్కో విజయానికి రూ. 30 లక్షల రూపాయాలు అందనున్నాయి. వరల్డ్ కప్ కు అర్హత సాధించిన 8 జట్లకు రూ. 2.2 కోట్ల రూపాయలు దక్కనున్నాయి.
ALSO READ : ప్లేయింగ్ 11లో హర్లీన్ డియోల్‌కు ఛాన్స్..
చివరిసారిగా 2022లో జరిగిన వరల్డ్ కప్ తో పోలిస్తే ప్రైజ్ మనీతో 300 శాతం పెరగడం విశేషం. సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 2 వరకు ఈ టోర్నీకి ఇండియా ఆతిధ్యమివ్వడంతో భారీ హైప్ నెలకొంది. ఎనిమిది జట్లు పాల్గొనే ఈ టోర్నమెంట్ ప్రైజ్ మనీ ఏకంగా 2023లో మెన్స్ క్రికెట్ లో ఇచ్చిన ప్రైజ్ మనీ కంటే ఎక్కువ కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. భారత్ వేదికగా జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ ప్రైజ్ మనీ రూ. 88 ఓట్ల రూపాయాలు కాగా.. ప్రస్తుతం ఇండియాలో జరగబోయే వరల్డ్ కప్ ప్రైజ్ మనీ రూ. 118 కోట్లు కావడం గమనార్హం. అంటే మెన్స్ కంటే రూ.30 కోట్లు ఎక్కువన్నమాట.
