ఈ ఏడాది (2025) నవంబర్ నెల ఉత్థాన ఏకాదశితో ప్రారంభమైంది. ముఖ్యంగా నవంబర్ ఆధ్యాత్మికంగా గొప్ప మాసం . ఈ 2025 నవంబర్ నెలలో కార్తీక పౌర్ణమి, తులసి వివాహం, పూర్ణిమ , శ్రీ సత్యసాయిబాబా జయంతి వంటి అనేక పవిత్రమైన పర్వదినాలతో పాటు పాటు ముఖ్యమైన అమావాస్య, ఏకాదశి కూడా ఉన్నాయి. ఈ పండుగలన్నీ విశేషమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. నవంబర్ 2025లో ఉన్న ప్రధానమైన పండుగలు, పర్వదినాల ఏవో తెలుసుకుందాం..
- నవంబర్ 1 శనివారం : ప్రబోధిని ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి
- నవంబర్ 2 ఆదివారం: తులసి వివాహం, క్షీరాబ్ది ద్వాదశి, కైశిక ద్వాదశి
- నవంబర్ 3 సోమవారం : ప్రదోష వ్రతం, విశ్వేశ్వర వ్రతం, సోమ ప్రదోష వ్రతం ( కార్తీకమాసం రెండో సోమవారం)
- నవంబర్ 4 మంగళవారం: వైకుంఠ చతుర్దశి
- నవంబర్ 5 బుధవారం : కార్తీక పౌర్ణమి, జ్వాలా తోరణం, ఉమామహేశ్వర వ్రతం గురునానక్ జయంతి, శ్రీ సత్యనారాయణ పూజ
- నవంబర్ 6 గురువారం: విశాఖ కార్తె
- నవంబర్ 7 శుక్రవారం: రోహిణి వ్రతం
- నవంబర్ 8 శనివారం: సంకటహర చతుర్థి, సౌభాగ్య సుందరి తీజ్
- నవంబర్ 10 : కార్తీకమాసం మూడో సోమవారం
- నవంబర్ 12 బుధవారం : కాలభైరవ జయంతి
- నవంబర్15 శనివారం : ఉత్పన్న ఏకాదశి ( ఉపవాస దీక్ష)
- నవంబర్16 ఆదివారం: వృశ్చిక సంక్రమణం, హజ్రత్ సయ్యద్ మహ్మద్ జువనపురి మెహిదీమావుద్
- నవంబర్17 సోమవారం : ప్రదోష వ్రతం, కార్తీకమాసం నాలుగో సోమవారం
- నవంబర్18 మంగళవారం : మాస శివరాత్రి
- నవంబర్20 గురువారం : కార్తీక మాసం అమావాస్య, అనురాధ కార్తె
- నవంబర్21 శుక్రవారం : చంద్రోదయం
- నవంబర్23 ఆదివారం: శ్రీ సత్యసాయిబాబా జయంతి
- నవంబర్24 సోమవారం : చతుర్థి వ్రతం
- నవంబర్ 25 మంగళవారం: వివాహ పంచమి
- నవంబర్26 బుధవారం : సుబ్రహ్మణ్య షష్ఠి, స్కంద షష్టి
- నవంబర్28 శుక్రవారం: దుర్గాష్టమి వ్రతం
