హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మామూలుగా పండగ వేళ ఈ రూట్ లో వాహనాలు కిలో మీటర్ల మేర నిలిచిపోవడం చూస్తాం .కానీ మొంథా తుఫాన్ ఎఫెక్ట్ తో రోడ్డుపై వరద నిలవడంతో ఇవాళ నవంబర్ 1న భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ రైల్వే అండర్ పాస్ దగ్గర భారీగా వర్షపు నీళ్లు నిలిచిపోయాయి. వరద నీరు నిలవడంతో బ్రిడ్జి కింది నుంచి బయటికి రావడానికి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో హైదరాబాద్ టూ విజయవాడ హైవే 65 పై రెండు వైపులా కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
చిట్యాల నుంచి పెద్దకాపర్తి వరకు ఐదు కిలోమీటర్ల వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ నుంచి నార్కట్ వైపు వెళ్లే వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి రంగంలోకి దిగారు పోలీసులు. విజయవాడ వెళ్లే వాహనాలను పెద్దకాపర్తి నుంచి రామన్నపేట వైపు దారి మళ్లిస్తున్నారు.
