Manjummel Boys: వేశాడు.. బాగా వేశాడు.. ఇళయరాజాకు మంజుమ్మల్ బాయ్స్ నిర్మాత సాలిడ్ కౌంటర్

Manjummel Boys: వేశాడు.. బాగా వేశాడు.. ఇళయరాజాకు మంజుమ్మల్ బాయ్స్ నిర్మాత సాలిడ్ కౌంటర్

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా(Ilayaraja)కు మంజుమ్మల్ బాయ్స్(Manjummel Boys) నిర్మాత సాలిడ్ కౌంటర్ ఇచ్చాడు. ఇటీవల మంజుమ్మల్ బాయ్స్ పై వచ్చిన వివాదంలో ఇళయరాజాకు కౌంటర్ ఇస్తూ.. అదిరిపోయే కౌంటర్ వేశాడు ఆ చిత్ర నిర్మాత. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఈమధ్య సంగీత దర్శకుడు ఇళయరాజా తన అనుమతి లేకుండా తన పాటలను సినిమాల్లో వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

తన అనుమతి లేకుండా తన పాటలను వాడుతున్న సినిమాలకు నోటీసులు పంపుతున్నారు. ఇటీవల రజినీకాంత్ హీరోగా వస్తున్న కొత్త సీనియా కూలి టీజర్ చివర్లో తన పాటను వాడినందుకు ఆ చిత్ర నిర్మాతలకు నోటీసులు పంపారు ఇళయరాజా. అది మరువక ముందే మలయాళ ఇండస్ట్రీ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ మంజుమ్మల్ బాయ్స్ చిత్ర యూనిట్ కి కూడా నోటీసులు పంపారు ఇళయరాజా. ఈ సినిమాలో తాను సంగీతం అందించిన గుణ సినిమాలోని కమ్మనీ నీ ప్రేమలేఖలే.. అనే పాటను వాడారు చిత్ర.

దీన్ని వ్యతిరేకిస్తూ చిత్ర యూనిట్ కు కోర్టు నుండి నోటీసులు పంపారు ఇళయరాజా. అయితే ఈ నోటీసులపై తాజాగా స్పందించిన చిత్ర నిర్మాత ఇళయరాజాకి సాలిడ్ కౌంటర్ ఇచ్చాడు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. మేము ఆ సినిమా మ్యూజిక్ కంపెనీ నుండి హక్కులు కొనుగోలు చేసిన తర్వాతే మా సినిమాలో వాడుకున్నాం. ఈ పాటకు ఓనర్లు అయిన శ్రీదేవి సౌండ్స్, పిరమిడ్ సంస్థల నుండి మేము హక్కులు పొందాము.. అని క్లారిటీ ఇచ్చాడు చిత్ర నిర్మాత. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.