ఇల్లెక్కిన ఆటో.. డ్రైవర్​ను అభినందించిన నెటిజన్లు.. అసలు విషయం తెలిస్తే షాక్​

ఇల్లెక్కిన ఆటో.. డ్రైవర్​ను అభినందించిన నెటిజన్లు.. అసలు విషయం తెలిస్తే షాక్​

ప్రస్తుతం హైటెక్​ యుగం నడుస్తుంది... ఎవరికైనా హెల్ప్​ చేస్తే.. ఒకరోజో.. రెండు రోజలో మహా అయితే ఒకపది రోజులు గుర్తుంచుకుంటారు.  ఇక అన్నం పెట్టిన వారిని  ఒకనెలో.. రెండు నెలలో.. గుర్తుంచుకుంటారు.  ఏదైనా అలాంటి సందర్భం వస్తే మళ్లీ గుర్తు చేసుకుంటాం.  కాని ఓ వ్యక్తి తనకు అన్న పెట్టిన వారిని అందలం ఎక్కించి రోజు చూసేలా ప్లాన్​ చేశాడు.   వివరాల్లోకి వెళ్తే...

ఓ ఆటోడ్రైవర్​ తన విశ్వాసాన్ని చూపించాడు.   ఓ ఆటోడ్రైవర్ కూడా డబ్బులు పోగుచేసి అందమైన ఇల్లు కట్టుకున్నాడు. ఆటోపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న అతడు తన సంపాదనతో కొత్త ఇల్లు కట్టుకున్నాడు.సొంత ఇల్లు కట్టుకోవడం ప్రతి ఒక్కరి జీవితంలో వారి చిరకాల స్వప్నం. ప్రతి పైసా పొదుపు చేసి అందమైన ఇల్లు కట్టుకోవాలని చాలా మంది కలలు కంటారు. దీని కోసం ప్రజలు చాలా సంవత్సరాల పాటు కష్టపడి డబ్బు ఆదా చేసి ఇళ్ళు నిర్మించుకుంటారు. అయితే, సొంతింటి కల నేరవేర్చిన ఆటోను తన జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకంగా ఉంచుకోవాలనుకున్నాడు.. అందుకోసం అతడు చేసిన పని తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అది చూసిన జనాలు ఆశ్చర్యపోయారు. అతడి ఔనత్యాన్ని ప్రశంసించారు.


ఒడ్డు దాటేంత వరకు ఓడ మల్లన, ఒడ్డు దిగిన తరువాత బోడ మల్లన్న అనే సామెత దాదాపు అందరూ వినే ఉంటారు.. దీని అర్థం కూడా అందరికీ తెలిసే ఉంటుంది. కానీ, ఓ ఆటో డ్రైవర్‌ తనకు అన్నం పెట్టిన ఆటోకు గౌరవం ఇవ్వలాని నిర్ణయించుకున్నాడు. దాని కోసం ఆ వ్యక్తి తన ఇంటి పైకప్పు మీద ఆటోను ఏర్పాటు చేశాడు. క్రేన్ సాయంతో అతడు ఆటోను ఇంటి పై కప్పు మీదకు ఎక్కించాడు. ఈ సమాచారం వీడియోతో పాటు వాయిస్ ఓవర్‌లో ఇవ్వబడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది. వినియోగదారులు దీన్ని చాలా ఇష్టపడుతున్నారు. ఆ ఆటో డ్రైవర్‌ని ఎంతగానో ప్రశంసించారు.

ఈ వీడియో Instagram హ్యాండిల్ @aryantyagivlogsలో షేర్‌ చేయబడింది. చాలా కష్టపడి క్రేన్ సహాయంతో ఆటోను పైకప్పుపైకి ఎత్తడం వీడియోలో కనిపించింది. ఇంటిపై అన్ని దిక్కులా కనిపించేలా ఎత్తైన ప్రదేశంలో ఆటోను ఏర్పాటు చేశాడు. ఈ వీడియోకి ఇప్పటి వరకు 27 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 16 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై తమ అభిప్రాయాన్ని కూడా తెలియజేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ..జీవనోపాధిని గౌరవించాలని, అది అందరికీ మంచిదని చెబుతున్నారు.