గుడ్ న్యూస్: హైదరాబాద్ లో రేపటి (సెప్టెంబర్ 29)నుంచే..రోజుకో వెరైటీ బ్రేక్ ఫాస్ట్

గుడ్ న్యూస్:  హైదరాబాద్ లో  రేపటి  (సెప్టెంబర్ 29)నుంచే..రోజుకో వెరైటీ బ్రేక్ ఫాస్ట్

హైదరాబాద్ నగర ప్రజలకు గుడ్ న్యూస్.సెప్టెంబర్ 29 నుంచి 5 రూపాయల బ్రేక్ ఫాస్ట్  స్కీం ప్రారంభం కానుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని మోతీ నగర్  మింట్ కాంపౌండ్ దగ్గర ఉన్న ఇందిరమ్మ క్యాంటీన్లో బ్రేక్ ఫాస్ట్ ను  మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మి ప్రారంభించనున్నారు. మొదటి దశలో 60 ప్రాంతాల్లో ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్ ఫాస్ట్  అందుబాటులోకి తేనుంది జీహెచ్ఎంసీ.  ఆ తర్వాత నగర వ్యాప్తంగా 150 ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్ ఫాస్ట్  అందించనుంది .  రోజుకు 25 వేల మందికి మిల్లెట్ టిఫిన్స్ అందించనుంది జీహెచ్ఎంసీ. మెనూలో ఇడ్లీ, ఉప్మా, మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా, పూరీలు, పొంగల్. క్యాంటీన్లు వారానికి ఆరు రోజులు ఓపెన్ చేయగా ఆదివారం క్లోజ్ చేస్తారు. 

రూ.14ని భరించనున్న బల్దియా  

ప్రస్తుతం హరే రామ హరే కృష్ణ మూవ్ మెంట్ తో కలిసి రూ.5 కే నాణ్యమైన, పౌష్టికమైన భోజనాన్ని అందిస్తున్న బల్దియా రూ.5 కే టిఫిన్స్ అందించేలా మరోసారి హరే రామా హరే కృష్ణ మూవ్ మెంట్ తో ఒప్పందం చేసుకుంది.  ఒక్క బ్రేక్ ఫాస్ట్ కు రూ.19 ఖర్చవుతుండగా, ఇందులో రూ. 5 ప్రజల నుంచి తీసుకుంటుండగా, రూ.14 బల్దియా భరించనున్నది. బస్తీ వాసులు, రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగులకు ఈ స్కీమ్ ఒక వరంలా మారనుందని, ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేస్తామని అధికారులు చెప్తున్నారు. రోజూ 25వేల మందికి బ్రేక్ ఫాస్ట్ అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

►ALSO READ | మూసీ ఒడ్డున ఉన్న పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు: సీఎం రేవంత్