హైదరాబాద్ సిటీ, వెలుగు: వాణిజ్య, వ్యాపార సంస్థలకు సంబంధించిన ప్రకటనలు, నేమ్ బోర్డుల అనుమతుల జారీని జీహెచ్ఎంసీ వికేంద్రీకరించింది. ఇంతకుముందు ఈ అనుమతులు పూర్తిగా జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లో మాత్రమే జారీ చేస్తుండగా, ఇప్పుడు సర్కిల్ స్థాయిలోనే వీటిని జారీ చేసేలా కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇకపై నేమ్ బోర్డులు, సైన్‌బోర్డుల ఏర్పాటు సంబంధించిన విషయాల కోసం సంబంధిత సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌ను సంప్రదించాలని ఓ ప్రకటనలో గురువారం సూచించారు. ఇందుకు సంబంధించిన అన్ని దరఖాస్తులు తప్పనిసరిగా ఆన్లైన్లోనే https://advt.ghmc.gov.in/ పోర్టల్ ద్వారా సమర్పించవచ్చని పేర్కొన్నారు.
