నేషనల్ క్రష్ కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చిన గిరిజా ఓక్!

నేషనల్ క్రష్ కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చిన గిరిజా ఓక్!

కొద్ది నెలల క్రితం ఓ పాడ్‌‌‌‌‌‌‌‌కాస్ట్‌‌‌‌‌‌‌‌లోని చిన్న వీడియో క్లిప్‌‌‌‌‌‌‌‌ కారణంగా  ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ పాపులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యారు నటి గిరిజా ఓక్.  ఆ వీడియోలో ముద్దు సీన్స్‌‌‌‌‌‌‌‌ గురించి వివరణ ఇచ్చిన ఆమె.. బ్లూ కలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శారీలో అందంగా కనిపించారు.  తన లుక్‌‌‌‌‌‌‌‌ నచ్చి  నేషనల్‌‌‌‌‌‌‌‌ క్రష్‌‌‌‌‌‌‌‌ అంటూ ఆమెను నెటిజన్స్‌‌‌‌‌‌‌‌ ట్రెండింగ్‌‌‌‌‌‌‌‌లోకి తెచ్చారు. తాజాగా గిరిజా ఓక్.. కంగనా రనౌత్‌‌‌‌‌‌‌‌ లీడ్‌‌‌‌‌‌‌‌ రోల్‌‌‌‌‌‌‌‌లో నటిస్తూ నిర్మించిన 'భారత్ భాగ్య విధాత' చిత్రంలో కీలకపాత్ర పోషించారు. 

ఈ  సినిమా ప్రమోషన్స్‌‌‌‌‌‌‌‌లో మాట్లాడిన కంగనా.. ‘నీ అందాన్ని ఉపయోగించి మన సినిమాను ప్రమోట్‌‌‌‌‌‌‌‌ చేయొచ్చుగా’ అని గిరిజను ఉద్దేశించి సరదాగా చమత్కరించారు. దీనిపై వినమ్రంగా స్పందించిన గిరిజ ఓక్‌‌‌‌‌‌‌‌.. ‘ఆ వీడియో ఎందుకు వైరల్ అయిందో అర్థం కాలేదు.. అందులో ఎలాంటి లాజిక్ లేదు.  నేను అందంగా ఉన్నానంటూ చాలా కామెంట్స్ వచ్చాయి. కానీ అది నా గొప్పతనం కాదు.. నా జన్యువుల వల్ల వచ్చింది. అయినా ‘నేషనల్‌‌‌‌‌‌‌‌’ అనే గుర్తింపు రావాలంటే సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌ ఉండాలి.. కంగనకు జాతీయ స్థాయి గుర్తింపు రావడం సబబు అవుతుంది కానీ నేను నేషనల్ క్రష్‌‌‌‌‌‌‌‌ అనడంలో ఎలాంటి ప్రామాణికత లేదు’’ అని క్లారిటీ ఇచ్చారు.  మనోజ్ తపాడియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 12న థియేటర్స్‌‌‌‌‌‌‌‌కు వస్తోంది.  కంగన, గిరిజా ఓక్‌‌‌‌‌‌‌‌లతో పాటు స్మితా తాంబే, ఇషా డే, ప్రియా బెర్డే, ఆశా షెలార్ కీలక పాత్రల్లో నటించారు.