టాలెంట్ స్టేజ్ గా రైళ్లు.. : చిన్నారి డాన్స్ కు నెటిజన్లు ఫిదా

టాలెంట్ స్టేజ్ గా రైళ్లు.. : చిన్నారి డాన్స్ కు నెటిజన్లు ఫిదా

రద్దీగా ఉన్న ట్రైన్లో ఓ చిన్నారి చేసిన డ్యాన్స్  సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త ఇంటర్ నెట్ ను షేక్ చేసింది.  రాయల్ బ్లే డ్రస్ ధరించిన ఆ చిన్నారి భోజ్‌పురి సాంగ్‌ కు మెలికలు తిరుగుతూ.. ఆమె ప్రదర్శించిన సంగీతం చూస్తే  ఎంతో నైపుణ్యం ప్రదర్శించిందని నెటిజన్లు కామెంట్ చేశారు. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..అందులో డ్యాన్స్ కు సంబందించిన వీడియోలు మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి..కొన్ని ఫన్నీగా కడుపుబ్బా నవ్విస్తే మరి కొన్ని మాత్రం షాక్ కు గురి చేస్తున్నాయి..అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది..ఓ యువతి డ్యాన్స్ వీడియో చూపరులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

విషయానికొస్తే.. భోజ్‌పురి సాంగ్‌ ఎంత పాపులర్‌ అయిందో అందరికీ తెలిసిందే. ఈ పాట మీద ఎంతోమంది డాన్స్‌ చేస్తూ రీల్స్‌ చేశారు.దాంతో ఈ సాంగ్‌ మరింత పాపులర్‌ అయిపోయింది. చిన్న,పెద్ద తేడా లేకుండా ఈ పాటకు స్టెప్పలు వేశారు. అయితే ఇలాంటి డాన్స్‌ మాత్రం ఎప్పుడూ చూసి ఉండరు. ప్రస్తుతం ఈ భోజ్‌పురి పాటకు ట్రైన్ లో  ఓ చిన్నారి చేసిన డాన్స్‌ ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తుంది. ఈ వీడియోను X ట్విట్టర్ లో squint Neon ఖాతా నుంచి పోస్ట్ చేయబడింది.  పోస్ట్  కొద్దిరోజులకే 562k  మంది వీక్షించడంతో వైరల్ గా మారింది.   బ్లూ డ్రస్ వేసుకున్న చిన్నారి డ్యాన్స్ చేయడంతో కొంతమంది వీడియో తీసి  ఆన్ లైన్ లో పోస్ట్ చేశారు.   

ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు.  కొంతమంది జీవితంలో విశ్వాసం అవసరం అని కామెంట్ చేయగా... మరికొంతమంది ఆ చిన్నారి నమ్మకాన్ని ప్రశంసించారు.  ఇంకొంతమంది  ఆ చిన్నారి ప్రదర్శించిన బెల్లి డ్యాన్స్ తీరు, వినోదం, విశ్వాసం, నైపుణ్యం  ఇలా అన్నీ పరిశీలిస్తే  10/10 అని భావిస్తున్నానని రాసుకొచ్చారు.