Girl dancing inside Delhi Metro : మెట్రో రైల్లో.. డాన్స్ బేబీ డాన్స్.. 

Girl dancing inside Delhi Metro : మెట్రో రైల్లో.. డాన్స్ బేబీ డాన్స్.. 

మెట్రో రైలు (delhi metro) అంటే చాలు రద్దీ..అసలు ఏ రైలు అయినా రష్.. ఇక ఢిల్లీ మెట్రో అంటే కిటకిటలాడుతుంది. అలాంటి మెట్రో రైల్లో ఓ అమ్మాయి డాన్స్ చేసింది. .చాలా చక్కగా.. పద్దతిగా.. ఎంతో ముచ్చటగా డాన్స్ చేసింది. రైల్లో ఏంటమ్మా డాన్సులు అని చెప్పాల్సిన మిగతా ప్రయాణికులు అందరూ.. అమ్మాయి డాన్స్ చూసి ఎంజాయ్ చేశారు.. 

మెడ్రన్ డ్రస్ లో ఉన్న ఆ అమ్మాయి.. జీన్స్ ఫ్యాంట్.. ఆరెంజ్ కలర్ టాప్ వేసుకుని ఉంది. (girl dancing inside Delhi Metro) కొంచెం ఎక్కువగానే మోడ్రన్ గా కనిపిస్తుంది. ఇక వీడియో తీసింది కూడా ఆ అమ్మాయి కావటం విశేషం. ఢిల్లీ మెట్రోకు స్వాగతం అని మెసేజ్ కూడా రికార్డ్ అయ్యింది. దీంతో ఈ వీడియో తీసింది ఢిల్లీ మెట్రో అని కన్ఫామ్ అయ్యింది. అమ్మాయి డాన్స్ చేస్తుంటే.. చుట్టుపక్కల ఉన్న ప్యాసింజర్స్ కూడా కొందరు వీడియో తీస్తూ కనిపించారు. మెట్రో రైళ్లు, బస్లాండ్లు, బస్సుల్లో, ఇతర పబ్లిక్ ప్లేసుల్లో ఎలాంటి డాన్సులు చేయకూడదని గట్టిగా ఆదేశాలు ఇచ్చాయి ఆయా శాఖలు, సోషల్ మీడియా వచ్చినా తర్వాత పాపులారిటీ కోసం.. వ్యూస్ కోసం చాలా మంది ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తున్నారంటూ.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అధికారులు. మొన్నటికి మొన్న హైదరాబాద్ రైల్వే స్టేషన్ లో ఓ అమ్మాయి డాన్స్ వైరల్ అయ్యింది. ఆ తర్వాత దేశంలోని అన్ని మెట్రో స్టేషన్లలో స్ట్రాంగ్ వార్నింగ్ ఙచ్చారు అదికారులు.

ఇలాంటి టైంలోనే ఏకంగా ఢిల్లీ మెట్రో రైలులోనే.. (metro rail dance viral video) జర్నీ చేస్తున్న సమయంలోనే ఓ అమ్మాయి డాన్స్ చేయటం వైరల్ గా మారింది. పోస్ట్ చేసిన ఒక్క రోజుల్లోనే లక్షల కొద్దీ వ్యూస్.. లైక్స్ వస్తున్నాయి.. అమ్మాయి డాన్స్ బాగుందని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. నడుస్తున్న రైల్లో ఇలాంటి పిచ్చివేషాలు ఏంటీ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా.. అమ్మాయి మాత్రం చాలా బాగా డాన్స్ చేసిందని.. అక్కడ ఖాళీ ఉంది.. డాన్స్ చేస్తే తప్పేంటీ అంటూ సమర్ధిస్తున్నారు మరికొందరు.. ఈ అమ్మాయికి కచ్చితంగా డాన్స్ షోలో అవకాశం ఇవ్వాలని మరికొందరు డిమాండ్ చేయటం విశేషం.. ఈవీడియోపై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం అని అంటోంది ఢిల్లీ మెంట్రో..