అమ్మాయిలకు ఫోన్లు ఇవ్వడం వల్లే రేప్ లు

V6 Velugu Posted on Jun 10, 2021

అమ్మాయిల ఫోన్ల వినియోగంపై ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలు మీనా కుమారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు ఎక్కువగా ఫోన్లు ఉపయోగించడం కారణంగానే  రేప్ లు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. వారు ఎక్కువ సమయం ఫోన్లు వాడొద్దన్నారు. అలీగఢ్ జిల్లాలో మహిళా ఫిర్యాదులపై విచారణల సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

గంటలకొద్దీ అబ్బాయిలతో..అమ్మాయిలు మాట్లాడటమే కాదు.. ఆ తర్వాత వారితో కలిసి పారిపోతున్నారని అన్నారు మీనా కుమారి. తల్లిదండ్రులు వారి ఫోన్లను చెక్ చేయకపోవడంతో ఇలాంటి విషయాలు తెలియడం లేదన్నారు. అంతేకాదు మహిళలపై పెరుగుతున్న నేరాలపై సమాజం కూడా ప్రభావం చూపిస్తోందన్నారు. తల్లిదండ్రులు.. ముఖ్యంగా తల్లులు.. తమ కూతుర్లను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. కూతుర్లు నిర్లక్ష్యంగా ఉంటున్నారంటే దానికి కారణం తల్లుల నిర్లక్ష్యమేనన్నారు. మరోవైపు  మీనా కుమారి వ్యాఖ్యలపై స్పందించారు కమిషన్ వైస్ చైర్ పర్సన్ అంజూ చౌదరి. ఫోన్లను వారి దగ్గర నుంచి తీసుకున్నంత మాత్రాన మహిళలపై లైంగిక హింస ఆగదన్నారు.

Tagged girls, UP, phones, leads rapes, Womens Commission member, Meena Kumari

Latest Videos

Subscribe Now

More News