హైదరాబాద్, వెలుగు: మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్ఠానం నుంచి కాంగ్రెస్ఎమ్మెల్సీ అభ్యర్థిగా చాన్స్ ఇవ్వాలని టీ-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి సోమవారం పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌ను కోరారు. తన ఎన్ఎస్ యూఐ ప్రయాణం, తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం, జర్నలిస్టుగా ప్రజా సమస్యలపై అధ్యయనం, పార్టీ పట్ల నిబద్ధతను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా తన రాజకీయ, వృత్తిపరమైన ప్రయాణం, ప్రజాసేవలో అనుభవం, సామాజిక కార్యక్రమాలు తదితర అంశాలతో రూపొందించిన డాక్యుమెంట్ ప్రొఫైల్‌ను మహేష్ కుమార్ గౌడ్‌కు అందజేశారు
