సుమన్ కీలకపాత్రలో కొత్త సినిమా

సుమన్ కీలకపాత్రలో కొత్త సినిమా

సుమన్ కీలకపాత్రలో.. భూషణ్, అంకిత జంటగా జిఎల్బి శ్రీనివాస్ దర్శకత్వంలో గురువారం కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు.  కాయగూరల లక్ష్మీపతి నిర్మాత.  పోలూరి ఘటికాచలం కథ మాటలు, వరికుప్పల యాదగిరి సంగీతాన్ని  అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సుమన్ మాట్లాడుతూ ‘ఈ క్రిస్మస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ఇండస్ట్రీకొచ్చి నలభై ఐదేళ్లు పూర్తవుతుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 700 చిత్రాల్లో నటించాను.

నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. ఇక ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నా’ అన్నారు. సుమన్ గారితో వర్క్ చేయడం హ్యాపీ అన్నారు హీరో, హీరోయిన్. దర్శకుడు మాట్లాడుతూ ‘డిసెంబర్ 19  నుంచి అనంతపురంలో షూటింగ్ మొదలవుతుంది. ప్యాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తున్నాం’ అని చెప్పారు.  నిర్మాతగా ‘ఐక్యూ’ చిత్రాన్ని పూర్తిచేయగానే రెండో సినిమాని ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు లక్ష్మీపతి.