రవితేజ టైగర్ నాగేశ్వరరావు మూవీలో..గ్లోబల్ యాక్టర్‌ అనుపమ ఖేర్

 రవితేజ టైగర్ నాగేశ్వరరావు  మూవీలో..గ్లోబల్ యాక్టర్‌ అనుపమ ఖేర్

మాస్ మహారాజ రవితేజ(Raviteja) హీరోగా వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageshwararao). డైరెక్టర్ వంశీ(Vamshi) తెరకెక్కిస్తున్న ఈ మూవీ నుంచి మరో అద్దిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 

ఈ మూవీలో గ్లోబల్ యాక్టర్‌ అనుపమ ఖేర్ నటించబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో IB ఆఫీసర్ రాఘవేంద్ర రాజ్‌పుత్ గా అనుపమ ఖేర్ యాక్ట్ చేస్తున్నారు. దీంతో టైగర్ ను వేటాడానికి ఆఫీసర్ వచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీ నుంచి ఆగస్టు 17న టైగర్ దండయాత్ర మొదలు అంటూ క్యాప్షన్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ నుంచి త్వరలో ట్రైలర్ రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. 

అనుపమ ఖేర్ హిందీ, మరాఠీ, పంజాబీ, మలయాళ, తమిళ చిత్రాల్లోనూ నటించారు. హాలీవుడ్‌లో బెండ్‌ ఇట్‌ లైక్‌ బెక్‌హామ్‌, బ్రైడ్‌ అండ్‌ ప్రిజ్యూడిస్‌ చిత్రాల్లో నటించి ప్రశంసలు అందుకున్నారు. మైనే గాంధీ కో నహీ మారా, డాడీ చిత్రాలకుగాను జాతీయ పురస్కారం అందుకున్న అనుపమ ఖేర్..2016 లో పద్మభూషణ్ అవార్డును సొంతం చేసుకున్నారు. 

ఈ మూవీలో రవితేజకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్‌ సోదరి నుపుర్‌ సనన్‌( NupurSanon)  నటిస్తుంది.ఇక రేణూదేశాయ్‌.. హేమలత  లవణం అనే పాత్రలో కీ రోల్ పోషిస్తుంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ఆక్టోబర్ 20న దసరా కానుకగా రిలీజ్ కానుందని ప్రకటించింది టీమ్. ఈ మూవీకు జీవి ప్రకాష్ కుమార్(gvprakashkumar) మ్యూజిక్ అందిస్తున్నారు.