జననాల రేటులో.. ప్రపంచంలోనే ఇండియా నంబర్.1.. 2025లో ఇంత మంది పుట్టారా..?

జననాల రేటులో.. ప్రపంచంలోనే ఇండియా నంబర్.1.. 2025లో ఇంత మంది పుట్టారా..?

భారత దేశంలో జననాల రేటులో సరికొత్త రికార్డ్ సృష్టించింది. 2025లో అత్యధిక జననాల రేటుతో టాప్-1 స్థానంలో నిలిచింది. 2025లో మన దేశంలో 23.1 మిలియన్ల మంది.. అంటే 2 కోట్ల 31 లక్షల మంది మన దేశంలో పుట్టారు. మన తర్వాత స్థానంలో చైనా నిలిచింది. 87 లక్షల మంది చైనాలో 2025లో జన్మించారు. నైజీరియా మూడో స్థానంలో ఉండటం ఒకింత విస్మయానికి గురిచేసింది.

2025లో నైజీరియాలో 76 లక్షల మంది జన్మించారు. పాకిస్తాన్ నాలుగో స్థానంలో ఉంది. 69 లక్షల మంది పాకిస్తాన్లో 2025లో పుట్టారు. 2025లో తక్కువ జననాల రేటుతో సౌదీ అరేబియా 50వ స్థానంలో నిలిచింది. 2025లో సౌదీ అరేబియాలో 5 లక్షల 65 వేల జననాల రేటు నమోదైంది. మొత్తం యూరప్ లో ఒక్క నైజీరియాలోనే 10 లక్షలకు పైగా జననాలు నమోదు కావడం విస్మయానికి గురిచేసిన విషయం.

ఇదిలా ఉండగా.. మన దేశంలో ఈ స్థాయిలో జననాల రేటు నమోదు కావడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటంటే.. 1950–51లో 27.4శాతం ఉన్న మరణరేటు 2020 నాటికి 6.0కి తగ్గింది. అంటే మరణరేటు వేగంగా తగ్గింది.

మరణరేటు తగ్గినంత వేగంగా జననరేటు తగ్గలేదు. కేరళ, తమిళనాడు, గోవాలు మినహాయించి మిగిలిన రాష్ట్రాల్లో జననరేటు చెప్పుకోదగిన విధంగా తగ్గలేదు. అనేక ఆర్థిక, సాంఘిక కారకాలు అధిక సంతానోత్పత్తికి అనుకూలంగా ఉన్నాయి.

చైనాలో ఒక సంతానం అనే నిబంధన రావడంతో చైనా గణనీయంగా జనాభా పెరుగుదల రేటును తగ్గించుకోగలిగింది. మన దేశంలో కేరళ, తమిళనాడు, గోవాలు మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో కుటుంబ నియంత్రణపై ప్రజల్లో అంత అవగాహన లేదు.