దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తన నటన, అందంతో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు శాండల్‌వుడ్ స్టార్ రమ్య అలియాస్ దివ్య స్పందన. ఈ బ్యూటీ కన్నడ నాట మాత్రమే కాకుండా సౌత్ ఇండియా మొత్తంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరేట్' గా మిగిపోయారు. సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై మెరిసిన ఈ కన్నడ క్వీన్.. ఉపేంద్ర సరసన 'రక్త కాశ్మీర' సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను గ్రాండ్‌గా రీ-స్టార్ట్ చేశారు.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్, మ్యారేజ్ ఆలోచనలపై రమ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్లి.. ప్రతి అమ్మాయి జీవితంలో తప్పనిసరిగా ఉండాల్సిందేనా? అన్న ప్రశ్నలు సూటిగా సమాధానం ఇచ్చారు. సమాజంలో వివాహం అనేది ఒక మైలురాయిగా చూస్తాను. కానీ జీవితంలో సంతోషంగా ఉంటడానికి పెళ్లి ఒక్కటే మార్గం కాదని పేర్కొంది.
ఒక వేళ లైఫ్ లో పెళ్లి చేసుకోవాలి.. లేదా సంతోషంగా అయినా ఉండాలి.. ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాలి అనే పరిస్థితి వస్తే.. నేను మాత్రం సంతోషంగా ఉండటానికే ప్రాధాన్యత ఇస్తానంటూ కీలక వ్యాఖ్యలు రమ్య కీలక వ్యాఖ్యలు చేశారు. వివాహం అనేది ఒక మనిషి వ్యక్తిత్వాన్ని నిర్థారించలేదని తేల్చిచెప్పారు.
తాను పెళ్లికి పూర్తిగా వ్యతిరేకం కాదు. కానీ ఆలోచనలు, లైఫ్ వాల్యూస్ కలిసే వ్యక్తి దొరికితేనే వివాహం అనే బంధానికి అర్థం ఉంటుంది. కేవలం సమాజం కోసమో.. వయసు అయిపోతోందనే ఒత్తిడితోనూ పెళ్లిళ్లు చేసుకోకూడదని ఆమె స్పష్టం చేశారు. అయితే ఇప్పటివరకు నాకు సరైన జోడీ దొరకలేదు. అసలు ప్రస్తుతం నా ఫోకస్ పెళ్లిపై లేదు. ఓ సంబంధాన్ని నడపడానికి సమయం, శ్రద్ధ కావాలి. ప్రస్తుతం నేను నా కెరీర్‌పై, సినిమాలపై పూర్తి దృష్టి పెట్టాను అని బోల్డ్‌గా సమాధానమిచ్చారు.
మొత్తానికి పెళ్లి లేకపోతే జీవితం అసంపూర్ణం అనే భావనకు తన మాటకు గట్టి కౌంటర్ ఇచ్చిన రమ్య .. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. సామాజిక కట్టుబాట్లను ప్రశ్నిస్తూ, సింగిల్‌గానూ ఎంతో హ్యాపీగా బతకొచ్చని రమ్య చెప్పిన మాటలకు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మహిళా అభిమానులు ఆమె ధైర్యాన్ని, స్పష్టమైన భావాలను కొనియాడుతున్నారు.
