V6 News

ప్రజలంతా ఏకమైతేనే గోసంరక్షణ సాధ్యం

ప్రజలంతా ఏకమైతేనే గోసంరక్షణ సాధ్యం
  • ఏప్రిల్ 27న జరిగే కార్యక్రమానికి మద్దతు తెలపాలి
  • గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్ పిలుపు

పంజాగుట్ట, వెలుగు: గోవును జాతీయ జంతువుగా ప్రకటించి, రక్షణ కల్పించాలని గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్ సంస్థ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో జరిగిన సమావేశంలో నాయకులు భద్రి విశాల్, రితేశ్ జాగిర్దార్ మాట్లాడుతూ.. గోసంరక్షణ కోసం దేశవ్యాప్తంగా శాంతియుత ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ఏప్రిల్ 27న దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమంలో హిందువులంతా పాల్గొని మద్దతు తెలపాలని, ప్రతి రెవెన్యూ, జిల్లా స్థాయి కార్యాలయాల్లో అధికారులకు వినతి పత్రాలు అందజేయాలని పిలుపునిచ్చారు. గోవును రక్షించడం వల్ల ప్రకృతికి, మానవాళికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ప్రజలంతా ఏకమై గోసంరక్షణకు కృషి చేస్తే ప్రభుత్వాలు కూడా సానుకూలంగా స్పందిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.