గుజరాత్ లో కరోనా కేర్ సెంటర్ గా మసీదు

గుజరాత్ లో కరోనా కేర్ సెంటర్ గా మసీదు

కరోనా రోగల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కేర్ సెంటర్లుగా ఏర్పాటు చేసి ట్రీట్ మెంట్ అందిస్తున్నాయి. అయినా కొందరికి వైద్యం అందడం లేదు. దీంతో ఓ మసీదు నిర్వాహకులు కరోనా సోకిన వారికోసం మసీదును కరోనా కేర్ సెంటర్ గా ఏర్పాటు చేసి వైద్య సౌకర్యం కల్పిస్తున్నారు.

గుజరాత్ లో రోజురోజుకూ కరోనా నమోదు కేసులు ఎక్కువ అవుతున్నాయి. దీంతో ప్రజలు భయాంధోళనకు గురవుతున్నారు. ట్రీట్ మెంట్ కోసం ఆస్పత్రుల బాట పడుతున్నారు. అయితే కొందరు వైద్య సధుపాయం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గోద్రాలోని మసీదు యజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. అలాంటి వారికి వైద్యం అందేలా చర్యలు తీసుకుంది. తమ మసీదులోని ఒక ఫ్లోర్‌ను క‌రోనా బాధితుల కోసం కేటాయించింది. ప్రార్ధనా స్థలాన్ని  కరోనా కేర్ సెంటర్ గా మార్చింది. ప్రస్తుతం  ఇక్కడ ఇత‌ర వ‌ర్గాల‌కు చెందిన 19 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.