హైదరాబాద్: నేషనల్ సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఐఈఎస్) టీమ్ గోల్డ్ మెడల్ సాధించింది. గుజరాత్‌లో శనివారం జరిగిన ఫైనల్లో తెలంగాణ 7–1తో ఆంధ్ర జట్టుపై నెగ్గింది. మ్యాచ్ మొత్తం తెలంగాణ ప్లేయర్లు డామినేషన్ చూపెట్టారు. విజయం సాధించిన ప్లేయర్లతో పాటు కోచ్‌లు, ఆర్‌సీ, ఆర్‌ఎస్‌సీ, ప్రిన్సిపాల్‌ను నిర్వాహకులు అభినందించారు. సాఫ్ట్ బాల్‌కు సపోర్ట్ ఇచ్చిన తెలంగాణ గవర్నమెంట్ అసోసియేషన్‌కు కూడా టీమ్ మెంబర్స్ కృతజ్ఞతలు తెలిపారు.

