మధ్యప్రాచ్యంలో ఘర్షణలు తగ్గుతాయన్న ఆశలతో అంతర్జాతీయ మార్కెట్లు కోలుకున్నాయి. దీని ప్రభావంతో మే 6న భారతదేశంలో బంగారం, వెండి ధరలు బాగా పెరిగాయి.
హోర్ముజ్ జలసంధిలో చిక్కుకున్న నౌకలను కాపాడేందుకు అమెరికా చేపట్టిన 'ఆపరేషన్ ఫ్రీడమ్'కు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా విరామం ఇచ్చారు. ఇరాన్‌తో చర్చలు జరిపి దాడులను శాంతియుతంగా ముగించవచ్చనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గుతాయన్న వార్తలతో ముడి చమురు ధరలు 2% తగ్గాయి. ప్రస్తుతం మార్కెట్‌లో 'యూఎస్ డబ్ల్యూటీఐ' క్రూడ్ ధర సుమారు $100, 'బ్రెంట్ క్రూడ్' ధర $108 వద్ద ఉన్నాయి. గత మూడు రోజులుగా దూసుకుపోతున్న అమెరికా డాలర్ విలువ కూడా 98 పాయింట్ల స్థాయికి పడిపోయింది. మొత్తానికి యుద్ధ భయాలు కాస్త తగ్గడంతో ప్రపంచ మార్కెట్లలో సానుకూల వాతావరణం కనిపిస్తోంది.
దింతో ఈరోజు (6 మే 2026) బుధవారం రోజున బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే :
1గ్రాము 24క్యారెట్ల బంగారం ధర రూ.213 పెరిగి రూ.15,131కి చేరగా, 22క్యారెట్ల బంగారం ధర రూ.195 ఎగిసి రూ.13,870కి చేరింది. 18క్యారెట్ల బంగారం ధర రూ.159 పెరిగి రూ.11,348 అయ్యింది.
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే రూ.2,130 పెరిగి రూ.1,51,310కి చేరగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,950 పెరిగి రూ.1,38,700కి చేరింది. 18 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.1,590 పెరిగి రూ.1,13,480కి చేరింది.
బంగారం ధరతో పాటు వెండి గ్రాము ధర రూ.5 పెరిగి రూ.270 పెరిగింది. దింతో వెండి కిలో ధర రూ.5 వేలు పెరిగి రూ.2,70,000కి పెరిగింది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వెండి ధర కిలోకి రూ.2 లక్షల 70 వేలు పలుకుతుంది.
ALSO READ : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు షాక్
ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి:
హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో 24క్యారెట్ల తులం ధర రూ.1,51,310, 22 క్యారెట్ల ధర రూ.1,38,700, 18 క్యారెట్ల ధర రూ.1,13,480
విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురంలో 24క్యారెట్ల తులం ధర రూ.1,51,310, 22 క్యారెట్ల ధర రూ.1,38,700, 18 క్యారెట్ల ధర రూ.1,13,480
