చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి బంగారు బోనం

చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి బంగారు బోనం

చార్మినార్, వెలుగు: చార్మినార్​ భాగ్యలక్ష్మి అమ్మవారికి మంగళవారం బంగారు బోనం సమర్పించారు. హరిబౌలి శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం నుంచి డప్పు చప్పుళ్లు, మేళతాళాలు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాల నడుమ జోగిని అవిక బంగారు బోనమెత్తుకుని భాగ్యలక్ష్మి దేవాలయానికి ఊరేగింపుగా వెళ్లారు.

అమ్మవారికి పట్టువస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించారు. కార్యక్రమంలో భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్​మధుసూదన్ యాదవ్, మాజీ చైర్మన్ గాజుల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.