నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన టీజీపీఎస్సీ

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన టీజీపీఎస్సీ

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాల భర్తీ వేగవంతం చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించిన టీజీపీఎస్సీ.. చెప్పినట్లుగానే వరుస నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. లేటెస్టుగా 2026 జూన్ 05న విద్యాశాఖలో ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. 

డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్–1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 24 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సిందిగా సూచించింది. 

  • ముఖ్యమైన తేదీలు:

అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్లను జూన్ 12 నుంచి జులై 19, 2026 వరకు స్వీకరిస్తారు. పూర్తి వివరాలు  https://www.tgpsc.gov.in/ వెబ్ సైట్ లో చూడగలరు.