టెక్ కంపెనీల్లో లేఆఫ్ ల పరంపర కొనసాగుతోంది. బడా కంపెనీలన్నీ పోటాపోటీగా ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ఈ క్రమంలో గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ మరోసారి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ మొదలుపెట్టింది. మొదట 137 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించి, 209 మందికి లేఆఫ్ లు ఇచ్చింది. జనవరిలో 12,000 మందికి ఉద్వాసన పలికింది. అయితే, ఇప్పుడు ఏ డిపార్ట్ మెంట్ నుంచి తొలగిస్తున్నారన్న విషయం తెలుపలేదు. తాజాగా 209 మందిని తొలగిస్తుండే సరికి ఉద్యోగుల్లో అయోమయం మొదలయింది.
