న్యూఢిల్లీ : యంగ్ ప్లేయర్లకు అవకాశం కల్పించాలన్న ఉద్దే శంతో ఢిల్లీ రంజీ జట్టు కెప్టెన్సీ పదవి నుంచి గౌతం గంభీర్ తప్పుకున్నాడు. గంభీర్ స్థానంలో యువ ఆటగాడు నితీష్ రాణాకు ఢిల్లీ జట్టు సా రథ్య బాధ్యతలు అప్పగించారు. 24 ఏళ్ల రాణా 24 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో ఆడాడు. కాగా వెస్టిం డీస్ తో కోల్ కతాలో జరిగిన టీ20 మ్యాచ్ కు ముందు ఈడెన్ గార్డెన్స్ లో మా జీ కెప్టెన్ అజారుద్దీన్ గంట మోగించటంపై గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో బీసీసీఐ, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ), సీఓఏలను ట్విటర్ వేదికగా తప్పుబట్టా డు. మ్యాచ్ ఫిక్సిం గ్ వివాదం కారణంగా నిషేదం ఎదుర్కొన్న క్రికెటర్ తో ఎలా బెల్ కొట్టిస్తారని పరోక్షంగా ప్రశ్నించాడు. ‘ఈడెన్ లో భారత్ ఈ రోజు మ్యాచ్ గెలవచ్చు కానీ బీసీసీఐ, సీఓఏ, సీఏబీలు గౌరవాన్ని కోల్పోయాయి’అని గంభీర్ అన్నాడు.
