న్యూఢిల్లీ: 2026 మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ శనివారం (మే 3) భారత జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన టీమిండియా స్వ్కాడ్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం వహించనుండగా.. స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా ఎంపికైంది. టైటిల్ గెలవడమే లక్ష్యంగా అన్ని సమీకరణాలను పరిగణలోకి తీసుకుని బీసీసీఐ జట్టును ఎంపిక చేసింది. యంగ్ బ్యాటర్ షఫాలీ వర్మ, స్మృతి మందనా, జెమీమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, రిచా ఘోష్, భారతీ ఫుల్మాలిలతో బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది.
పేస్ గుర్రం రేణుకా సింగ్ ఠాకూర్ పేస్ బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపించనుంది. యువ పేసర్ క్రాంతి గౌడ్ ఆమెకు సహకారం అందించనుంది. ఇక, స్పిన్ విభాగంలో దీప్తి శర్మ తన మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేసేందుకు సిద్ధమైంది. దీప్తికి తోడుగా రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, యువ బౌలర్ నందిని శర్మ జట్టులో ఉన్నారు.
►ALSO READ | కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయంలో అభిషేక్ ప్రత్యేక పూజలు.. సెంటిమెంట్ రిపీటైతే కేకేఆర్‌పై విధ్వంసమే
టీ20 వరల్డ్ కప్ స్వ్కాడ్‌లో స్టార్ ఆల్ రౌండర్ అమన్‌జోత్ కౌర్ చోటు దక్కలేదు. గాయం కారణంగా ఆమె టోర్నీకి దూరమయ్యారని కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తెలిపారు. అలాగే, కాష్వీ గౌతమ్‌కు కూడా నిరాశ ఎదురైంది. యువత, అనుభవజ్ఞుల కలయికతో కూడిన ఈ జట్టుపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
కాగా, 2026, జూన్ 12 నుంచి ఇంగ్లాండ్ వేదికగా మహిళల టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. గ్రూప్ ఏలో ఉన్న భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడటం ద్వారా ప్రపంచ కప్ టోర్నీని ప్రారంభించనుంది. 2026, జూన్ 14న దాయాదుల మధ్య హైఓల్టేజ్ పోరు జరగనుంది. గ్రూప్ ఏలోనే ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా వంటి జట్లు ఉండటం గమనార్హం.
భారత మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 జట్టు
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, భారతీ ఫుల్మాలి , దీప్తి శర్మ , రిచా ఘోష్ (వికెట్ కీపర్), శ్రీ చరణి, యస్తికా భాటియా (వికెట్ కీపర్), నందని శర్మ, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ థాకూర్, క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్.
