IPL 2026: చెన్నైతో హై ఓల్టేజ్ పోరు.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై

IPL 2026: చెన్నైతో హై ఓల్టేజ్ పోరు.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై

చెన్నై: ఐపీఎల్ 19లో భాగంగా శనివారం (మే 2) చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ హై ఓల్టేజ్ పోరులో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచింది. దీంతో ఎంఐ కెప్టెన్ హర్ధిక్ పాండ్యా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. హోం గ్రౌండ్‎లో సీఎస్కే మొదట బౌలింగ్ చేయనుంది. ఇరు జట్లు పలు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి. సీఎస్కే స్టార్ ధోనీ, ముంబై స్టార్ రోహిత్ శర్మ ఈ కీలక పోరుకు దూరమయ్యారు. 

మ్యాచులో ధోనీ, రోహిత్ లేకపోవడంతో ఇరు జట్ల అభిమానులు కాస్తా నిరాశకు గురయ్యారు. గత వారం వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్‎ను వాళ్ల సొంతగడ్డపైనే చెన్నై చిత్తు చేసింది. శనివారం (మే 2) చెపాక్‎లో జరుగుతోన్న పోరులో చెన్నైను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని ముంబై భావిస్తోంది. మరీ ఈ ఉత్కంఠభరిత మ్యాచులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలీ.   

జట్లు:

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): 

సంజు శాంసన్ (w), రుతురాజ్ గైక్వాడ్ (సి), ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, జామీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరి

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): 

విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్(w), సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), రాబిన్ మింజ్, ట్రెంట్ బౌల్ట్, క్రిష్ భగత్, జస్ప్రీత్ బుమ్రా, AM గజన్‌ఫర్