పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో, కొత్త కారు కొనాలనుకునే వారికీ ఏది కొనాలో అర్థం కాక ఆలోచనలో పడుతుంటారు. ముఖ్యంగా CNG, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లలో దేని మెయింటెనెన్స్ తక్కువ..? దేని వల్ల ఎక్కువ లాభం..? అనే విషయాలు సామాన్యులును కలవరపెడుతుంటుంది
మీ బడ్జెట్‌కు ఏ కారు సెట్ అవుతుందంటే ?
1. CNG కార్లు : సాధారణ మధ్యతరగతి ప్రజలకు ఇప్పటికీ CNG కార్లే మొదటి ఛాయిస్. దీని ఇంధన ఖర్చు చాల తక్కువ, ఒక కిలో CNG ధర సుమారు రూ. 75 నుండి రూ. 80 వరకు ఉంటుంది. ఇక మైలేజ్ చూస్తే ఒక కిలోకు 20 నుండి 25 కిలోమీటర్ల వరకు మైలేజ్ వస్తుంది. అంటే మీరు ఒక కిలోమీటరు ప్రయాణించడానికి కేవలం రూ. 3 నుండి రూ. 4 మాత్రమే ఖర్చవుతుంది. చిన్న ఇబ్బంది ఏంటంటే సిఎన్‌జి స్టేషన్ల దగ్గర క్యూలు ఎక్కువగా ఉండటం, అన్ని ఊర్లలో CNG అందుబాటులో లేకపోవడం కొంచెం ఇబ్బందికరం.
2. హైబ్రిడ్ కార్లు
హైబ్రిడ్ కార్లు పెట్రోల్ & బ్యాటరీ.. రెండింటి సహాయంతో నడుస్తాయి. దీని పనితీరు చూస్తే తక్కువ స్పీడ్‌లో ఉన్నప్పుడు బ్యాటరీని స్పీడ్ పెరిగినప్పుడు పెట్రోల్‌ను వాడుకుంటాయి. మైలేజ్ చూస్తే ఇవి లీటరుకు 20 నుండి 25 కిలోమీటర్ల మైలేజీని ఇస్తాయి. అంటే కిలోమీటరుకు సుమారు రూ. 5 నుండి రూ. 6 వరకు ఖర్చవుతుంది.ప్లస్ పాయింట్ ఏంటంటే సిటీలో తిరిగే వారికి.... అప్పుడప్పుడు హైవేలపై వెళ్లే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే బ్యాటరీ అయిపోయినా పెట్రోల్‌తో ప్రయాణం కొనసాగించవచ్చు.
►ALSO READ | మార్కెట్ సెగ.. నిండా మునిగిన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్.. వెంటాడుతున్న నెగటివ్ రిటర్న్స్..!
3. ఎలక్ట్రిక్ కార్లు
రానున్న రోజుల్లో భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ కార్లదే (EV). ఇవి కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా, మీ జేబుకు కూడా చాలా భారాన్ని తగ్గిస్తాయి. ఎలక్ట్రిక్ కార్ల ఛార్జింగ్ ఖర్చు చూస్తే ఒక యూనిట్ విద్యుత్ ధర రూ. 7 నుండి రూ. 10 అనుకుంటే, పూర్తి ఛార్జింగ్‌కు తక్కువ ఖర్చే అవుతుంది. ఈ లెక్కన ఒక కిలోమీటరు ప్రయాణానికి కేవలం రూ. 1 నుండి రూ. 2 మాత్రమే ఖర్చవుతుంది. కాకపోతే చిన్న ఇబ్బంది ఏంటంటే ఛార్జింగ్ స్టేషన్లు ఇంకా అన్ని చోట్లా అందుబాటులోకి రాలేదు. పైగా కార్ ఛార్జింగ్ ఎక్కడానికి కొంచెం టైమ్ పడుతుంది. ఇవి పూర్తి ఛార్జ్‌తో, 250–300 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు.
ఏ కారు ఎవరికి కరెక్ట్?
మీకు దగ్గరలో CNG బంకులు ఉండి, రోజుకు ఎక్కువ దూరం తిరిగేవాళ్లైతే హ్యాపీగా CNG కారు తీసుకోండి. ప్రయాణం ఎక్కువగా సిటీలోనే ఉండి, సేవింగ్స్ తో పాటు కంఫర్ట్ కావాలంటే హైబ్రిడ్ కారు కొనడం మంచిది. అన్నింటికంటే తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయాలి అనుకుంటే ఎలక్ట్రిక్ కారు బెస్ట్ ఛాయిస్. కారు కొనే ముందు కేవలం షోరూమ్ ధరనే కాకుండా, రోజూ ప్రయాణానికి అయ్యే ఖర్చులను కూడా లెక్కవేసుకుంటే మీ నిర్ణయం పక్కాగా ఉంటుంది.
