ప్రజా జీవితంలో ఉంటూ సేవ చేయడం సహజం, కానీ ప్రైవేట్ రంగంలో ఉంటూ సమాజం కోసం ఇంత పెద్ద ఎత్తున స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించాలనే సత్తయ్య ఆలోచన గొప్పదని మంత్రి వివేక్ ప్రశంసించారు. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న సత్తయ్య సేవా కార్యక్రమాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ప్రభుత్వ పరంగా ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు పూర్తి స్థాయిలో ఫ్యాకల్టీ ,ఇతర సహాయ సహకారాలు అందేలా కృషి చేస్తానని మంత్రి వివేక్ హామీ ఇచ్చారు.
►ALSO READ | పేద బిడ్డలను ప్రోత్సహిస్తే.. క్రీడల్లో అద్భుతాలు సృష్టిస్తారు : ప్రొఫెసర్ కంచ ఐలయ్య
హైదరాబాద్ తెల్లాపూర్‌లో కొల్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన సీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి ఈ సందర్భంగా.. విద్యార్థులు ప్రపంచ స్థాయిలో రాణించాలంటే క్రమశిక్షణతో కూడిన క్రీడలు, అంతర్జాతీయ స్థాయి ఇంగ్లీష్ విద్య ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. యువత తప్పుడు మార్గాల్లో వెళ్లకుండా గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ జీవితంలో ఎదగడానికి క్రీడలు ఒక గొప్ప పాఠం అని అన్నారు. తన తండ్రి కాకా వెంకటస్వామి నిరుపేదల అభివృద్ధి కోసం చేసిన కృషిని గుర్తు చేసుకున్న మంత్రి.. ఒక్క రోజైనా మంత్రిగా చేయాలన్న కోరిక నెరవేరిందన్నారు. తండ్రి ఆశయ సాధనలో పేదల సేవకే అంకితమవుతానని ఆయన స్పష్టం చేశారు.
