హార్ముజ్ ను దాటిన ..మరో ఎల్పీజీ భారత నౌక సర్వశక్తి

హార్ముజ్ ను దాటిన ..మరో ఎల్పీజీ భారత నౌక సర్వశక్తి

అమెరికా, ఇరాన్ యుద్దం కారణంగా పశ్చిమాసియా లో తలెత్తిన ఉద్రిక్తతల మధ్య భారత్ కు చెందిన మరో  ఎల్పీజీ నౌక హార్మజ్ జలసంధిని దాటి  స్వదేశం వైపు పయనిస్తోంది. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) తో నిండిన భారత్ కు చెందిన సర్వశక్తి నౌక 45వేల టన్నుల ఎల్పీజీతో హార్ముజ్ దాటి ఇండియావైపు పయనిస్తోందని సముద్ర ట్రాఫిక్ డేటా చెపుతోంది. ఇరాన్ నౌకలపై అమెరికా విధించిన నిర్భంధంతో హార్ముజ్ లో చమురు నౌకల రాకపోకలు నిలిచిపోయిన తర్వాత జలసంధిని దాటిన తొలి నౌక సర్వశక్తి. 

సముద్ర ట్రాఫిక్ డేటా ప్రకారం..లిక్విడ్  పెట్రోలియం గ్యాస్‌(LPG)ను తీసుకువస్తున్న  భారత్ కు చెందిన సూపర్‌ట్యాంకర్ సర్వశక్తి శనివారం(మే2)  హోర్ముజ్ జలసంధిని దాటింది. ఇరాన్ లోని లారాక్, ఖేష్మ్ దీవులు దాటి ఒమన్ గల్ఫ్ లోకి ప్రవేశించించింది. బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం..ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) ఈ ఎల్పీజీని కొనుగోలు చేసింది. ఇరాన్‌కు సంబంధించిన నౌకాయానంపై అమెరికా దిగ్బంధనం విధించడంతో రవాణా తగ్గిపోయింది. అప్పటి నుంచి ఈ మార్గంలో దాదాపు ఎటువంటి నౌకలు ప్రయాణించలేదు. సర్వశక్తి రాక భారత్ దౌత్యపరంగా ఓ పెద్ద ముందడుగు అవుతుంది.

►ALSO READ | ఇరాన్ పని అయిపోయింది.. ఇక క్యూబా మిగిలింది: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు