ట్రంప్ దృష్టి ఇప్పుడు క్యూబా వైపు మళ్లిందా?.. ఫస్ట్ వెనుజులా..తర్వాత ఇరాన్..ఇప్పుడు క్యూబా..ఇప్పటికే క్యూబా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందకు అనేక ఆంక్షలు పెట్టిన ట్రంప్..మరో దండయాత్రకు సిద్దమవుతున్నాడని తెలుస్తోంది. శుక్రవారం పామ్ బీచెస్ ఫోరం క్లబ్ లో మాట్లాడిన ట్రంప్.. క్యూబాపై దాడి విషయాన్ని జోక్ గా చెప్పినప్పటికీ దాని వెనక తన అసలు ఉద్దేశం ట్రంప్ పరోక్షంగా చెప్పారు.
ట్రంప్ ఏదీ మాట్లాడినా..హాస్యంగా..వ్యంగంగా మాట్లాడటం అతని స్టయిల్.. వెనుజులా, ఇరాన్ పై దాడికి ముందుకూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇప్పుడు ఇరాన్ తో యుద్దం కొనసాగుతున్న క్రమంలో కూడా చాలా సార్లు వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు క్యూబాపై దాడి విషయం కూడా పామ్ బీచెస్ ఫోరం క్లబ్ లో తన ప్రసంగంలో చాలా ఫన్నీగా చెప్పాడు.
ఇరాన్ మిషన్ తర్వాత మా యుద్ద నౌకలుతిరిగి అమెరికాకు వచ్చే దారిలో క్యూబా తీరంలో ఆగుతాయంటూ అంటూ చమత్కరించారు. ఇరాన్ నుంచి తిరిగి వచ్చేటపుడు మా అతిపెద్ద యుద్ద నౌకలలో ఒకటైన యూఎస్ ఎష్ అబ్రహాం లింకన్ క్యూబా తీరానికి 100 గజాల దూరం ఆపి, ‘‘మీకు చాలా ధన్యవాదాలు.. మేం లొంగిపోతున్నాం’’ అని చెప్పేలా చేస్తామంటూ ఆ దేశం పట్ల తన వైఖరిని చాలా క్లియర్ గా చెప్పారు. ఇది హాస్యంగా చెప్పినప్పటికీ క్యూబా పట్ల రోజురోజుకు అమెరికా దూకుడు వైఖరిని చెప్పకనే చెబుతోంది.
క్యూబా ప్రభుత్వం,దాని ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ ఇప్పటికే కొత్త ఆంక్షలు విధించారు. ఇంధనం, రక్షణ, మైనింగ్, ఆర్థిక సేవలు ,భద్రత వంటి కీలక రంగాలల్లో వ్యక్తులు ,సంస్థలపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చమురు సరఫరా, ఆర్థిక వనరులపై ఆంక్షలతో తీవ్రసంక్షోభంతో సతమతమవుతున్న హవానాపై ట్రంప్ ఈ వ్యాఖ్యల ద్వారా ఆర్థిక, రాజకీయ మరింత ఒత్తిడి పెంచి తన దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ట్రంప్ వైఖరిని అని కేబినెట్ లోని కీలక వ్యక్తులు కూడా బలపర్చారు. క్యూబాపై ఆంక్షలు మరింత కఠినతరం చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇదే క్రమంలో క్యూబాను నియంత్రించేదుకు సైనిక చర్యలకు దిగవచ్చని అంటున్నారు. ఆయన తాజా వ్యాఖ్యలు..హాస్యంగా చేసినప్పటికీ క్యూబాపై దాడిని వ్యంగ్యంగా ఆయన వాక్చాతుర్యపు తీరును ప్రతిబింబిస్తున్నాయి.
