హైదరాబాద్ లోని గచ్చబౌలిలో అగ్నిప్రమాదం జరిగింది. గచ్చిబౌలి పరిధిలోని అంజయ్యనగర్ లో నిర్వహిస్తున్న ఓయో హోటల్ మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో హోటల్ తోపాటు ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పారు.
శనివారం (మే2) సాయంత్రం జరిగిన ఈప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే ప్రమాద సమయంలో ముగ్గురు కస్టమర్లు హోటల్ రెండో అంతస్తులో ఉండగా.. ఫైర్ సిబ్బంది వారిని సురక్షితంగా కిందికి తీసుకొచ్చారు. ఆస్తినష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట వల్లే మంటలు చెలరేగినట్లు ఫైర్ సిబ్బంది ప్రాథమిక నిర్దారణకు వచ్చారు.
►ALSO READ | హైదరాబాద్‌లో విషాదం.. కాలేజ్ నుంచి రాగానే డీజిల్ పోసుకుని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
